హుజురాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఈటెల... అసలు వ్యూహం ఇదే?

తెలంగాణలో రాజకీయ సమరం మొదలైందని చెప్పవచ్చు.ఇప్పటికే త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుందనే అనధికారిక సమాచారంతో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

 Etela Spearheading The Campaign In Huzurabad Is This The Real Strategy-TeluguStop.com

టీఆర్ఎస్ ను దుబ్బాక తరహాలో ఒడించాలని అనుకుంటున్న తరుణంలో బీజేపీ భారీ వ్యూహాలను రచిస్తోంది.హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన ఈటెల తెరాసకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

టీఆర్ఎస్ ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టకున్నా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యాక మొదలుపెట్టే అవకాశం ఉంది.

 Etela Spearheading The Campaign In Huzurabad Is This The Real Strategy-హుజురాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఈటెల… అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bjp, Dubbaka Elections, Etela Rajender, Huzurabada Elections, Kcr, Mla Etela Rajender, Trs-Political

దుబ్బాక తరహాలోనే హుజూరాబాద్ ఎన్నిక సంచలనం రేపే అవకాశం ఉంది.ఏది ఏమైనా మరో ఉత్కంఠ పోరుకు హుజూరాబాద్ వేదిక కాబోతున్నదని చెప్పవచ్చు.ఏది  ఏమైనా కెసీఆర్ దుబ్బాక తరహా పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితులలో ఈ సారి భారీ వ్యూహం రచించేలా కనిపిస్తోంది.

అంతేకాక ఇప్పటికే టీఆర్ఎస్ క్యాడర్ కు కూడా ఆదేశాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.ఎట్టి పరిస్థితులలో గెలిచేలా స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేసి ఈటెలపై బీజేపీ ముద్ర వేసి తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

కెసీఆర్ ఇప్పటి వరకు ఈటెలపై బహిరంగంగా వ్యాఖ్యానించనప్పటికీ బహిరంగ సభ నిర్వహిస్తే ప్రచార వ్యూహం బయటపడే అవకాశం ఉంది.మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

#Etela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు