రాజకీయ ( Politics )సమావేశాల్లో భాగంగా హైదరాబాదులో ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఈటెల ( Etela Rajender )రాష్ట్రంలో బిజెపి ( BJP )పరిస్థితిపై తేల్చేసినట్లుగా తెలుస్తుంది .ఖమ్మం జిల్లా( Khammam district ) ముఖ్యనేత అయిన పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) ,మహబూబ్నగర్ జిల్లా నేత జూపల్లి బారాసా నుండి బహిష్కరించబడి సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు .
తమ తమ నియోజకవర్గాల్లో కీలక పట్టున్న ఈ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే అదనపు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్న పార్టీలు ఈ నేతలపై వల వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.అయితే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్న ఈ నేతలు ఏ పార్టీలో చేరతారో మాత్రం ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు.
భాజపాలో చేరతారని కొన్ని రోజులగా వార్తలు వస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.ఇప్పుడు ఈ విషయంపై తనను అడిగిన విలేకరులకు వారు బాజాపా లో చేరటం కష్టం అని భావిస్తున్నాను అని అసలు విషయం చెప్పేసారు ఈటెల .

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ( Congress )పార్టీ బలంగా ఉందని ఒప్పుకున్న ఆయన దేశానికి వామపక్ష భావనలు నేర్పిన గడ్డ తెలంగాణ అని, అందువల్ల ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే ఉందని చెప్పడం ద్వారా తెలంగాణలో తమ పార్టీ ఇంకా బలపడాల్సిన అవసరాన్ని ఆయన బహిరంగంగా చెప్పినట్లయ్యింది ….ఆ నేతలకు తమ పార్టీ లో చేరడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే ,సోనియా గాంధీ పొంగులేటిని కలిసినట్లుగా తమకు సమాచారం ఉందని ,అయితే సోనియాగాంధీ కంటే ముందు నుంచి నేను వారితో టచ్ లో ఉన్నానని కొన్ని కారణాలరీత్యా వారు భాజపాలు చేరేందుకు సుముఖం గా లేరని చెప్పుకొచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విభేదాలు ,వర్గ పోరు ఉన్నప్పటికీ భాజపా కన్నా కాంగ్రెస్సే ఒక మెట్టు ముందు ఉంది అన్న వాదనలకు ఇప్పుడు తన మాటలతో బలం చేకూర్చారు ఈటల రాజేందర్.వచ్చే ఎన్నికలలో అధికారానికి వచ్చేస్తామని హడావిడి చేస్తున్న భాజపా నేతల తీరుకు విరుద్ధంగా వాస్తవ పరిస్థితి చెప్పేసిన ఈటెల వచ్చే ఎన్నికల్లో తాము ఇంకా ఎదగాల్సింది ఉందన్న నిజాన్ని ఒప్పుకోవడం అభినందనీయం.
