కరోనాతో డాక్టర్‌ చనిపోవడంపై మంత్రి ఈటెల ఆవేదన

కరోనా రోగులకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న వైధ్యులకు భరోసాగా ఉంటామంటూ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు.ఇటీవల భద్రాచలం కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేష్‌ మృతిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 Etela Rajender Respond On Doctor Died With Corona, Etela Rajender, Telangana, Co-TeluguStop.com

కరోనాతో పోరాడి మృతి చెందిన డాక్టర్‌ నరేష్‌ కుటుంబంకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చాడు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న వారు చాలా గొప్ప వారంటూ మంత్రి అభిప్రాయ పడ్డారు.

అలాంటి వారికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు.

నరేష్‌ మృతిపై ఈటెల మాట్లాడుతూ.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.నరేష్‌ భార్య ఉన్నత చదువులు చదివారు కనుక ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానంటూ హామీ ఇచ్చారు.

వైధ్యులు ఇకపై కరోనాతో మృతి చెందకుండా అత్యున్నత వైధ్య సేవలు అందిస్తామంటూ పేర్కొన్నారు.ప్రాణాలు పనంగా పెట్టి వైధ్యం అందిస్తున్న వైధ్యులు ఆందోళన చెందకుండా అధైర్య పడకుండా ఉండాలని ఈటెల అన్నారు.

ప్రభుత్వం నుండి అన్ని విధాల సాయంను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube