రాష్ట్ర ప్రజలకు కరోనా నేపథ్యంలో ఈటెల ఒక సూచన

కరోనా సామాజిక వ్యాప్తి మొదలయ్యింది.మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసులు వేలల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.

 Etela Rajender Suggestion For Covid 19 Patients , Coronavirus, Telangana, Etela-TeluguStop.com

ముఖ్యంగా మద్యతరగతి వారు కరోనా అని నిర్థారణ అయిన వెంటనే పెద్ద ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు.ఈ సమయంలో వారి అవసరాన్ని అదునుగా తీసుకుని ప్రైవేట్‌ ఆసుపత్రి వారు లక్షల ఫీజులు దండుకుంటున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు మీటింగ్‌ పెట్టి హెచ్చరించినా కూడా వారు తగ్గడం లేదు.

తాజాగా ఈ విషయంపై మంత్రి ఈటెల స్పందిస్తూ కరోనా భయంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు అవ్వద్దు.

ప్రభుత్వం అందరికి మెరుగైన చికిత్స అందించేందుకు సిద్దంగా ఉంది.ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి కమ్యూనిటి లో క్లబ్‌ హౌస్‌ లు లేదంటే ఏవైనా భవనాలు కోవిడ్‌ పేషంట్స్‌ కు ఇస్తే ప్రభుత్వం సిబ్బందిని మరియు మందులను ఇచ్చేందుకు రెడీగా ఉందని మంత్రి అన్నారు.

ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా ఉండి కరోనాను ఎదిరించాలంటూ ఆయన పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube