హత్య చేయాలని చూశారు ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్..!!

టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావటంతో ఆయనని ఆరోగ్య శాఖ మంత్రి నుండి కెసిఆర్ తొలగించడం తెలిసిందే.ఈ పరిణామంతో విపక్షాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

 Etela Rajender Sensational Shocking Comments That Murder Attempt Has Done On Him-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా తనపై వస్తున్న ఆరోపణల విషయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.తెలంగాణ ఉద్యమం సమయంలో.

తనని హత్య చేయాలని నయీం గ్యాంగ్ పన్నాగం పన్నారని ఆరోపించారు.అయినా కానీ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి మరీ పోరాడాను అని పేర్కొన్నారు.

 Etela Rajender Sensational Shocking Comments That Murder Attempt Has Done On Him-హత్య చేయాలని చూశారు ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే తరుణంలో ప్రస్తుత పరిణామాలు విషయంలో కూడా తాను భయపడే ప్రసక్తే లేదని.తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కోర్టు కి వెళ్తాను, తప్పు లేదని నిరూపించుకుంటామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

సంబంధం లేని భూముల విషయంలో తనపై కక్షపూరితంగా కేసీఆర్ అండ్ కో అంటగట్టడం జరిగిందని మండిపడ్డారు.అదేవిధంగా తన భార్య పై కేసులు పెట్టడం దారుణమని ఖండించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వానికి 19 సంవత్సరాల పాటు సేవలు అందించాను… అలాంటిది తన ని అంతమొందించడానికి కక్షపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అధికారం చేతిలో ఉన్నా గాని చట్టం ఒప్పుకోదు అంటూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఈటెల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు.

 అదేవిధంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచిస్తాను అని స్పష్టం చేశారు

#KCR Government #EtelaShocking #Telangana #IllegalLand #Nayeem Gang

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు