కాంగ్రెస్ ను నడిపిస్తోంది కేసీఆరేనా ? ' 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో, వాటిని సరిదిద్దుకునేందుకు సమయం సరిపోవడం లేదు.

 Etela Rajender Sensational Comments On Kcr About Congress Issue, Kcr, Trs, Uttam-TeluguStop.com

ఒకపక్క పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా, ఫలానా నేతకు ఆ పదవి ఇస్తే తాము ఊరుకోము అంటూ కొంతమంది నాయకులు బెదిరింపులకు దిగడం ఎలా ఎన్ని రకాలుగా అక్కడ పరిణామాలు నెలకొన్నాయి.టిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ బలపడాలని చూస్తున్నా, అది సాధ్యం కావడం లేదు.

ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించి 2023 ఎన్నికల్లో అధికార పార్టీ గా మారాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం ఇంకా పార్టీలోని పరిస్థితులను చక్కదిద్దుకునే పనిలోనే ఉంది.

ఇది ఇలా ఉండగా, తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

టిఆర్ఎస్ లో అంతర్గతంగా నడిచే వ్యవహారాలతో పాటు ఇతర పార్టీలను కెసిఆర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని మీడియా సమావేశంలో హరీష్ రావు బయటపెట్టడంతో కాంగ్రెస్ లో కలకలం రేగింది.తెలంగాణ కాంగ్రెస్ ను నడిపిస్తోంది ఎవరు ? ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ఎవరు ? అంటూ ఈటెల రాజేందర్  మాట్లాడిన తీరు తో కాంగ్రెస్ లో కలకలం రేపింది.

Telugu Revanth Reddy-Telugu Political News

పరోక్షంగా ప్రస్తుత పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కనుసన్నలలో పనిచేస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడడంతో కాంగ్రెస్ లో పెద్ద దుమారమే లేచేలా కనిపిస్తోంది.ఈటెల విమర్శల్లో నిజం ఉందా అన్నట్లుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల్లో పరిస్థితులు నెలకొన్నాయి.చాలా కాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ వామపక్ష పార్టీల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది.కేవలం రేవంత్ రెడ్డి,  మరో ఒకరిద్దరు నేతలు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.

మిగతా వారంతా సైలెంట్ గా ఎందుకు ఉండిపోతున్నారు అనేదానికి ఇప్పుడు ఈటెల వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేస్తోంది.

 కాంగ్రెస్ వామపక్ష పార్టీలను కేసీఆర్ తన కనుసన్నల్లో పెట్టుకున్నారని, కెసిఆర్ పరోక్షంగా ఈ రెండు పార్టీలను కంట్రోల్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఈటెల వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినా, గట్టిగా సమాధానం అయితే ఇవ్వలేకపోయారు.దీంతో ఈటెల చేసిన ఆరోపణలు వాస్తవాలే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ లో ఈ వ్యవహారం మరింత కాక రేపేలా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube