మంత్రి ఈటెల పై వేటు ? రేవంత్ బయటపెట్టిన సంచలన విషయం ఏంటి ?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న తీరుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.మొదటి నుంచి ఈ వ్యవహారం లో కెసిఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కరోనా టెస్ట్ లు చేయడంలోనూ, ముందు జాగ్రత్తలు తీసుకోవడం లోనూ ఆయన విఫలమయ్యారు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Etela Rajendar, Revanth Reddy, Trs Party, Kcr, Corona Virus, Corona Tests-TeluguStop.com

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పైనా, కెసిఆర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను వచ్చేవారం కేబినెట్ నుంచి తొలగిస్తున్నాము అంటూ ప్రకటన కెసిఆర్ చేయబోతున్నారని, అసలు ఈటెల ను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కేసీఆర్ రాష్ట్రంలో ఈ పరిస్థితి తీసుకు వచ్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ టెస్ట్ ల సంఖ్య 50 వేలు కూడా దాటలేదని, రేవంత్ చెప్పుకొచ్చారు.టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి కి కరోనా వైరస్ వస్తే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అదే సామాన్యులకు కరోనా సోకితే గాంధీ ఆసుపత్రి దిక్కు అని రేవంత్ విమర్శించారు.

రేవంత్ విమర్శలు ఆ విధంగా ఉంటే, తెలంగాణలో మిగతా రాజకీయ పక్షాలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఇదే తరహాలో విమర్శలు చేస్తున్నాయి.కరోనా టెస్ట్ లు చేసేందుకు, కేసుల సంఖ్య బయటికి వెల్లడించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టపడడం లేదని ఆయన అన్నారు.

Telugu Corona, Etela Rajendar, Revanth Reddy, Trs-Telugu Political News

ఈ వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానాలు కలుగుతున్నాయని, ఇప్పటికే ఈ విషయంలో కోర్టు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని మండిపడుతున్నాయి.అయితే ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ స్పందించింది.ఈ మేరకు మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరోనా టెస్ట్ లు ఐసీఎంఆర్ నిబంధనల మేరకే చేస్తున్నామని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube