కేసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న ఈటెల.. వ్యూహం ఫలించేనా?

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ఆసక్తికర రాజకీయంతో  హాట్ హాట్ గా కొనసాగుతోంది.ఎన్నడూ లేనంతగా వ్యక్తులే టార్గెట్ గా రాజకీయ వ్యూహాలు పన్నడం, అదే వరుసలో పార్టీల పరంగా టార్గెట్ చేస్తూ రాజకీయం కొనసాగుతున్న పరిస్థితి ఉంది.

 Etela Rajender Political Strategy To Defeat Kcr, , Political Strategy,cm Kcr, Et-TeluguStop.com

ఇలాంటి వ్యూహంతో ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఈటెల.ఆత్మగౌరవ నినాదంతో టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన ఈటెల  కేసీఆర్ టార్గెట్ గా తన రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి ఉంది.

దీంతో బీజేపీ టార్గెట్ కేసీఆర్ అయినా బీజేపీ నాయకులకు రాజకీయ ఎజెండా ఉన్నా ఈటెలకు మాత్రం వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.దీంతో బీజేపీ చేయాల్సిన సింహ భాగం పని ఈటెల చేస్తుండటంతో ఈటెలకు భవిష్యత్తులో మరింతగా ప్రాధాన్యతను పెంచే అవకాశం కనిపిస్తోంది.

Telugu Bjp Trs, Cm Kcr, Etela Rajender, Etelarajender, Strategy, Telangana-Polit

అయితే రానున్న రోజుల్లో బీజేపీకి, టీఆర్ఎస్ కు భీకర పోరు ఉండనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కు అన్ని వైపులా అవకాశాలను నిలిపివేసేలా భారీ వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.కాని ఈటెల మాత్రం తనకున్న రాజకీయ అనుభవంతో ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో అక్కడ బీజేపీ పటిష్టం చేసేలా స్థానిక నేతలకు సూచనలు, సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాక టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో బీజేపీని బలోపేతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈటెల వ్యూహాలను,బీజేపీ వ్యూహాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తూనే సరైన సమయంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.

ఏది ఏమైనా ఈటెల మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నంతగా కేసీఆర్ టార్గెట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.మరి ఈటెల వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube