టీఆర్ ఎస్ స్కీములపై మాట్లాడ‌ని ఈట‌ల‌.. లోలోప‌ల మ‌ద‌న ప‌డుతున్నారా..?

ఈట‌ల రాజేంద‌ర్ అంటే తిరుగులేని నేత‌గా మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు.తాను ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేసిన ప్ర‌తి ఎన్నిక‌ల్లో గెలుస్తూనే వ‌చ్చారు.

 Etela Rajender Not Talking About Trs Schemes Is Her Falling Inside, Trs Schemes,-TeluguStop.com

కాగా అనూహ్య ప‌రిణామాల‌తో టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డంతో ఇప్పుడు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పాలి.మొన్న‌టి వ‌ర‌కు అండ‌గా ఉన్న వారు, స‌న్నిహితంగా ఉన్న వారే ఇప్పుడు త‌న‌పై గెలిచేందుకు ప్ర‌చారం బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో ఇది ఆయ‌న‌కు పెద్ద ఇబ్బందిగా మారింది.

ఇక ఎలాగైనా ఈట‌ల‌ను ఓడించి త‌న పంథం నెగ్గించుకోవాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది.

ఇందుకోసం గ‌తంలో ఏ ఎన్నిక‌ల‌కు లేన‌న్ని పాట్లు ప‌డుతోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే టీఆర్ ఎస్ త‌న ద‌గ్గ‌ర ఉన్న శ‌క్తుల‌ను ఉప‌యోగిస్తోంది.ఏకంగా ఒక్క ఉప ఎన్నిక కోసం ద‌ళిత‌బంధు లాంటి స్కీమును తెచ్చిందంటే ఎంత సీరియ‌స్‌గా తీసుకుందో అర్తః చేసుకోవ‌చ్చు.

అయితే ఈ స్కీముల ఎఫెక్ట్ ప్ర‌జ‌ల్లో బాగానే ముద్ర వేస్తోంద‌ని చెప్పాలి.ఇక మొద‌టి నుంచి టీఆర్ ఎస్ స్కీముల‌ను ద‌గ్గ‌రి నుంచి చూస్తూ వ‌స్తున్న ఈట‌ల‌కు ఇప్పుడు వీటి ఎఫెక్ట్ త‌గులుతోంది.

ఎందుకంటే ఆయ‌న్ను ఓడించేందుకు ఆగిపోయిన స్కీముల‌ను మ‌ళ్లీ స్టార్ట్ చేస్తోంది టీఆర్ ఎస్‌.

Telugu Dalitabandhu, Etala Rajender, Etela Kcr, Huzurabad, Telangana, Trs Scheme

కొత్త రేష‌న్ కార్డుల ద‌గ్గ‌రి నుంచి, కొత్త పింఛ‌న్లు, రెండో విడ‌త గొర్రెల పంపిణీ, ఇక హుజూరాబాద్‌లో అత్య‌ధికంగా ఓట్లు ఉన్న ద‌ళితుల కోసం ఏకంగా ద‌ళిత బంధు స్కీమును పెడుతోంది.దీంతో ఈట‌ల కూడా వీటి జోలికి పెద్ద‌గా పోవ‌ట్లేదు.ఎందుకంటే ఈ స్కీముల‌పై ఎలాంటి పెద్ద విమ‌ర్శ‌లు చేసినా చివ‌ర‌కు అది త‌న‌కు మైన‌స్ అవుతుంద‌నే భావ‌న‌తోనే వాటిపై పెద్దగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా కేవ‌లం టీఆర్ ఎస్‌, కేసీఆర్‌, మంత్రుల‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ స్కీములు ఎక్క‌డ త‌న గెలుపుకు అడ్డంకిగా మారుతాయో అన్న‌భ‌యం ఈట‌ల‌లో స్పష్టంగా క‌నిపిస్తోంద‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube