ఈటెల మామూలోడు కాదు ! టెన్షన్ పడుతున్న టీఆర్ఎస్ ?

టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్ ప్రభావం ఇప్పుడు బిజెపిలో క్రమక్రమంగా పెరుగుతోంది.రాజేందర్ కు బీజేపీ చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలను అప్పగించారు.

 Etela Rajender Appointed As The Chairman Of Bjp State Campaign Committees Detail-TeluguStop.com

రాజేందర్ కి ఈ పదవి రావడంతో టిఆర్ఎస్ అసంతృప్త నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు.బిజెపి నుంచి పెద్దగా ఆహ్వానాలు అందకపోవడంతో అసంతృప్త నాయకుల చూపు కాంగ్రెస్ పైనే ఎక్కువ గా పడింది.

టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కెసిఆర్ వెంట నడిచిన ఈటెల రాజేందర్ కు ఇప్పటికీ టీఆర్ఎస్ లో మంచి గుర్తింపు ఉంది.ఇప్పుడు ఆ ప్రభావంతోనే టిఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులను పెద్ద ఎత్తున బిజెపిలో చేర్చుకుంటారని, అలాగే నియోజకవర్గస్థాయి కీలక నాయకులను బిజెపి వైపు తీసుకెళ్తారనే భయం టిఆర్ఎస్ లో ఎక్కువైంది.

ఈ మేరకు టిఆర్ఎస్ లోని అసంతృప్తి నాయకులు ఎవరు పార్టీ మారకుండా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎవరెవరు పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు.? పార్టీ మారాలనుకుంటున్న వారు ఎవరు ? ఇలా అనేక అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఆరా తీస్తున్నారట.ఇంటెలిజెన్స్ అధికారులు ఇస్తున్న రిపోర్ట్స్ ద్వారా పార్టీ మారాలనుకున్న నేతలను బుజ్జగించి వారికి సరైన సమయంలో సరైన ప్రాధాన్యం కల్పిస్తామని, పార్టీ మారవద్దంటూ కీలక నాయకులను రంగంలోకి దింపే ఆలోచనలో ఉందట.

Telugu Etela Rajendar, Hujurabad Mla, Telangana, Trs-Political

ఈటెల రాజేందర్ రాజకీయ వ్యూహాల్లో బాగా ఆరితేరిన వారు.ఏ సమయంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి.టిఆర్ఎస్ కి అనేక సందర్భాల్లో ఆయన తగిన విధంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారు.ఇప్పుడు బిజెపిలో ఆయన ఉండడంతో, ఆ పార్టీని మరింత బలోపేతం చేసి బీజేపీ లో మరిన్ని కీలక పదవులు సంపాదించేందుకు ప్రయత్నిస్తారని, పూర్తిగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని బలహీనం చేస్తారనే టెన్షన్ కూడా టిఆర్ఎస్ పెద్దల్లో పెరిగిపోతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube