ఈటెల కు ' కారు ' ముప్పు ? పార్టీ గుర్తు పై గందరగోళం ?

తెలంగాణలో అతిపెద్ద పార్టీ.అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే స్థాయిలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు.

 Etela Rajendar Tention On Party Symbol Issue-TeluguStop.com

రాజేందర్ బలం బలగం తెలిసిన టిఆర్ఎస్ ఆయనను ఓడించేందుకు కోట్లాది రూపాయలు సొమ్మును ప్రభుత్వ పథకాల పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గం లో వెచ్చించేందుకు వెనకాడడం లేదు.ఏదో రకంగా రాజేందర్ ప్రభావం తగ్గించి ఆయనను ఓడించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో తమకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని టిఆర్ఎస్ చూస్తుండగా, అటు రాజేందర్ కూడా బిజెపి సహకారంతో తనకు గట్టి పట్టు ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలిచి తీరాలని చూస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం అంతా పాదయాత్ర చేపడుతూ, జనాల్లో మరింతగా తన ఇమేజ్ పెరిగేలా చేసుకుంటున్నారు.

 Etela Rajendar Tention On Party Symbol Issue-ఈటెల కు కారు ముప్పు పార్టీ గుర్తు పై గందరగోళం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇక్కడే ఆయనకు ఇబ్బంది వచ్చిపడింది.

ఆరుసార్లు టిఆర్ఎస్ నుంచి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్ అనూహ్య పరిణామాల మధ్య తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఆయన బిజెపిలో చేరడంతో కమలం గుర్తుపైనే ఆయన పోటీ చేస్తున్నారు.

అయితే రాజేందర్ కు వరుసగా విజయం అందిస్తూ వచ్చిన ప్రజలు కారు పార్టీ గుర్తుపై ఓటు వేసిన అనుభవం ఉండడంతో, ఇప్పుడు ఆ గుర్తు కాదని, కమలం గుర్తుకు ఓటు వేసే విషయంలో కన్ఫ్యూజ్ అవుతారనేది ఈటెల రాజేందర్ భయంగా తెలుస్తోంది.ఇప్పటి వరకు రాజేందర్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగానే పోటీ నెలకొనడం మినహా, బిజెపి అభ్యర్థి అనే విషయం పెద్దగా వెళ్ళకపోవడం తదితర కారణాలతో ఈ వ్యవహారం ఆయనకు సవాల్ గా మారింది.

Telugu Bandi Sanjay, Bjp, Car, Etela Rajendar, Hujurabad Election, Kcr, Ktr, Rajendar Tention Party Sybol Issue, Telangana, Trs, Trs Election Symbol-Telugu Political News

ఇప్పటికే రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అనుచరులకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.రాజేందర్ కే తమ మద్దతు ఉంటుందని, కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటూ అనేక మంది చెబుతూ ఉండడంతో, రాజేందర్ గుర్తు కమలం అని ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అంటూ వివరంగా రాజేందర్ అనుచరులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందట.తన అభ్యర్థిత్వంతో పాటు, తన గుర్తు కమలం అని ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం రాజేందర్ గుర్తించారట.ఒకవైపు టిఆర్ఎస్ ను ఎదుర్కొంటూనే, గుర్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి రాజేందర్ కు ఏర్పడింది.

ఈ గుర్తు కన్ఫ్యూజన్ ఎక్కడ తమ కొంప ముంచుతుందో అనే టెన్షన్ రాజేందర్ లో నెలకొంది.

#Etela Rajendar #Rajendar Sybol #Bandi Sanjay #Telangana #Trs Symbol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు