మొత్తానికి ఈటెల ఈ విధంగా డిసైడ్ అయ్యారా ?

తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది అందరికీ ఉత్కంఠ గానే ఉంది.ఆయన టిఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చేసే రోజులు మరెంతో కాలం లేవు .

 Etela Rajendar Take Key Desistion, Etela Rajender, Telangana, Kcr, Ktr, Minister-TeluguStop.com

అసలు టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయకముందే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే తన రాజీనామా కోరకుండా డైరెక్టుగా తనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం పైన ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

కానీ ఆగ్రహంతో కాకుండా,  ఆలోచనతో ముందుకు వెళ్తున్న రాజేందర్ తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ క్రమంలో ఆయన త్వరలోనే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు , ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రాజీనామా చేసినా, ఎన్నికలకు వచ్చే సరికి ఆరు మాసాలు సమయం ఉంటుందని,  అప్పటిలోగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని, ఈ సమయంలోగా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే బిజెపి కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి.

అదే సమయంలో సొంత పార్టీ పెట్టాలని ఒత్తిడి ఆయన ప్రధాన అనుచరుల నుంచి ఎక్కువగా వస్తూ ఉండడం వంటి విషయాలతో ఏం చేయాలి అనే దానిపై ఆయన తేల్చుకోలేకపోతున్నారు.కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో ఆయన క్లారిటీ గా ఉండడంతో,  తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో పాటు,  రాజకీయంగా రాజేందర్ తీసుకునే నిర్ణయం తో టిఆర్ఎస్ ప్రకంపనాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడం, తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిన తర్వాత రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో రాజేందర్ ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube