రాజీనామా చేయలేదు అడిగితే చేశా ! పాదయాత్రలో 'ఈటెల ' ఏమన్నారంటే ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు.తాజాగా నియోజకవర్గంలో నాలుగో రోజు పాదయాత్ర చేపట్టిన రాజేందర్ ఈ సందర్భంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు నేను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదు.

 Etela Rajendar Sensational Coments On Kcr Etela Rajendar Coments On Kcr, Trs Gov-TeluguStop.com

వాళ్ళే నన్ను రాజీనామా చేయమని అడిగితే చేశా.నేను పార్టీని విడిచి పెట్టలేద వదిలి పెట్టేలా చేశారు.’ అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో చోటు చేసుకున్న అనేక పరిణామాలను ఆయన ప్రస్తావిస్తూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పద్దెనిమిదేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి జైల్లో ఉన్న వ్యక్తిని నేను.మంత్రి అయ్యాక కూడా కేసులు కోసం గంటల కొద్ది కోర్టుల దగ్గర గడిపాను.అయినవాడికి ఆకుల్లో, కాని వాళ్ళకు కంచాలలో పెట్టాడు కేసీఆర్.తెలంగాణ ఉద్యమంలో పులిబిడ్డ లా కొట్లాడిన వాళ్లంతా బజార్లో పడ్డార.

మా రక్తాన్ని కళ్ల చూసిన వారు, అవమానించిన వారు ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారుఅంటూ విమర్శించారు.కేసిఆర్ కు దళితులపై ప్రేమలేదని, ఓట్లకోసం దళితులకు పది లక్షలు ఇస్తానని కెసిఆర్ బరితెగించి చెబుతున్నాడు అంటూ ఈటెల ఫైర్ అయ్యారు.

తనను ప్రశ్నించేవాడు తెలంగాణ గడ్డ మీద ఉండకూడదని కెసిఆర్ భావిస్తున్నాడని అన్నారు బానిసలుగా బతికేవాళ్ళు కావాలట నేను బానిసను కాదు కాబట్టే నన్ను ఓడించాలని చూస్తున్నాడు.నా మొఖం మీద అసెంబ్లీ కనిపించొద్దట.

నా ముఖమే కదా ఆనాడు ఆంధ్ర పెత్తందారుల ను ఎదిరించింది.

Telugu Dalithabandhu, Etelarajendar, Hujurabad, Kcr, Trs-Telugu Political News

నా ముఖమే కదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపింది.నాకు గొంతే కదా తెలంగాణ ప్రజల గోస వినిపించింది.మీకు పింఛన్ కావాలన్నా, కొనుగోలు కేంద్రాలు కావాలన్నా, మొక్కజొన్నలు కొనాలన్నా, నేను మాట్లాడితేనే కదా వచ్చాయి అంటూ ఈటెల చెప్పుకొచ్చారు.

రైతుబంధు పేరుతో కెసిఆర్ ఐదు వేల ఇచ్చి మొక్కజొన్న లకు 15000 నష్టం కలిగించారని మండిపడ్డారు.మంత్రిగా ఉండి కూడా పింఛన్లు, తెల్లకార్డులు ఇప్పించలేకపోయమన్నారు.మూడేళ్లుగా ఒక్కరికైనా కొత్త పింఛన్ ఇచ్చారా ? ఓట్లకు ముందు 57 ఏళ్లు నిండితే పెన్షన్ అన్నాడు ఏమైంది ? నా వల్ల హైదరాబాదులో 11 వేల మంది కి కొత్త పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు వస్తున్నాయి.

Telugu Dalithabandhu, Etelarajendar, Hujurabad, Kcr, Trs-Telugu Political News

నా దళిత జాతికి 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడు. హుజురాబాద్ తో పాటు రాష్ట్రమంతా ఉన్న దళితులు అందరికీ పది లక్షలు చొప్పున ఇవ్వాలి.ఓట్లు ఉన్న దగ్గరే గొల్లకుర్మలకు గొర్రెలను ఇస్తారు.

వాళ్ల మీద ప్రేమ పై మాత్రం కాదు అంటూ ఈటెల అనేక విమర్శలతో కేసీఆర్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube