పాదయాత్ర పై 'ఈటెల ' స్పందన ఇదే !

తన పాదయాత్ర ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గం అంతా పర్యటించి తన పట్టు నిలుపుకోవాలని, టిఆర్ఎస్, కాంగ్రెస్ తన దరిదాపుల్లోకి కూడా పోటీకి రాకుండా చేసుకోవాలనే వ్యూహంతో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.అయితే పాదయాత్ర చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడం, హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరడం వంటివి జరిగాయి.

 Etela Rajendar Respond On Padayathra Issue-TeluguStop.com

ఆసుపత్రిలో పదిహేను రోజుల పాటు విశ్రాంతిలోనే ఉండాలంటూ వైద్యులు సూచించినా, హడావుడిగా నిన్న రాజేందర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయారు.దీంతో ఇక హుజురాబాద్ లో ఇతర రాజకీయ అంశాలపై దృష్టి పెడతారని, పాదయాత్ర చేస్తారని అంతా భావిస్తుండగా, రాజేందర్ ఈ విషయంపై స్పందించారు.

తాను సీరియస్ రాజకీయ నాయకుడిని అని డ్రామా ఆర్టిస్ట్ ని కాదు అని, తనకు ఉన్న ఆప్షన్ పాదయాత్ర మాత్రమే అని రాజేందర్ స్పందించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పాదయాత్ర ఆపేది లేదని, కొనసాగిస్తానని, మూడు నాలుగు రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తరువాత పూర్తిస్థాయి పాదయాత్ర చేస్తాను అంటూ రాజేందర్ ప్రకటించారు.

 Etela Rajendar Respond On Padayathra Issue-పాదయాత్ర పై ఈటెల స్పందన ఇదే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.ఐదు రోజులుగా ఆస్పత్రుల్లో ఉండడంతో.అన్ని రోజులు తాను బాగుండాలని, పూజలు చేయించి, దీవించారని రాజేందర్ అన్నారు.

Telugu Congress, Etela Rajendar, Kcr, Prajadeevena Yathra, Revanth Reddy, Telangana, Trs, Trs Government-Telugu Political News

18 ఏళ్లుగా ఉద్యమంలో పని చేసి వివిధ హోదాల్లో ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తున్నానని, ఉద్యమ సహోదరులు ఇప్పుడు కనుమరుగయ్యారు అని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.మానుకోట లో రాళ్లు వేసిన వారికి ఎమ్మెల్సీ పదవి అప్పగించారన్నారు.2018 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారని, తనను ఓడించడానికి పనిచేసిన వారికి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోదని, వీటన్నిటినీ హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారని, కెసిఆర్ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారు అంటూ రాజేందర్ అభిప్రాయపడ్డారు.

#Etela Rajendar #TRS #Congress #Revanth Reddy #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు