టీఆర్ఎస్ పై ఈటెల ఫైర్ ! తోడేళ్లు దాడి చేసినట్టు అంటూ...?

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నిత్యం హాట్ టాపిక్ గా నే మారుతూ వస్తోంది.రాజేందర్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.

 Etela Rajendar Angry On Trs Leaders Behaviour And Warnings , Etela Rajendar, Kcr-TeluguStop.com

ఆ వ్యూహాల నుంచి తప్పించుకుంటూ , రాజకీయంగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారు.అయితే రాజేందర్ కొత్త పార్టీ పెడతారా లేక వేరే ఏదైనా పార్టీలో చేరుతారా అనే టెన్షన్ టిఆర్ఎస్ అగ్రనేతలకూ ఉంది.

అందుకే ముందుగా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పై పూర్తి ఫోకస్ పెట్టారు.అక్కడ ఆయనకు ఆదరణ లేకుండా చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది.

రాజేందర్ కనుక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, అక్కడ ఉప ఎన్నికలు వస్తే, ఆయనకు విజయం దక్కకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా అర్థమవుతోంది.


టిఆర్ఎస్ రాజకీయాలపై రాజేందర్ తాజాగా సీరియస్ అయ్యారు.‘ ఊర్లలో కరోనా సోకి అనేక మంది చనిపోతున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టారు.

కానీ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు హుజురాబాద్ ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు అంటూ ఈటెల ఫైర్ అయ్యారు.

ఇటువంటి వ్యవహారాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సందర్భంగా రాజేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు.” 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి, చైతన్యం నింపి ఆత్మగౌరవ బావుటా ఎగరవేసిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారు.


Telugu Covid, Etela Rajendar, Etelarajendar, Hujurabad, Kcr, Telangana, Trs-Telu

ఉద్యమంతో సంబంధం లేని మంత్రి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు.అదే పనిగా సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి, డబ్బు ఆశ చూపడం, ప్రలోభాలకు గురి చేయడం, బిల్లులు రావని బెదిరించడం చేస్తున్నారు.వాళ్ళకు ఇష్టం లేకున్నా, నాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు.

ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.పిడికెడు మంది స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన, ప్రజాభిప్రాయాన్ని మారుస్తానని అనుకోవడం వెర్రి బాగులతనం.

హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవం ఉన్న వారు.ఇలాంటి చిల్లర మల్లర చర్యలు తిప్పికొడతారు అంటూ ఈటెల ఫైర్ అయ్యారు.20 ఏళ్ల నుంచి కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురి చేస్తే సహించం అంటూ టిఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.’ ముందుగా కరోనా పేషెంట్ లను కాపాడండి.ఇలాంటి చిల్లర పనులు వెకిలి చేష్టలు చేయకండి ‘ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube