ఆ పని చేయకుండా ఉండాల్సిందంటూ అంతర్మధనం చెందుతున్న ఈటెల

కేసీఆర్ ఈటెలను భర్తరఫ్ చేసిన నాటి నుండి ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఈటెల – కేసీఆర్ రాజకీయ యుద్ధం నడుస్తోంది.ఇక కేసీఆర్- టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 Etela Intercepting About That Work-TeluguStop.com

తాజాగా ముదిరాజులందరిని ఏకం చేస్తూ కుల రాజకీయం చేయడానికి ఈటెల ప్రధానంగా దృష్టి పెట్టాడేమో అన్నట్లుగా ఈటెల తీరు ఉంది.అయితే ఇప్పుడు ఈ విషయమే కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు తెలంగాణలో కులం బహిరంగంగా వచ్చి రాజకీయాల్లో ఓ అంతర్గత పాత్రగా ఉంది తప్ప బహిరంగ ప్రదర్శన చేయలేదు.

 Etela Intercepting About That Work-ఆ పని చేయకుండా ఉండాల్సిందంటూ అంతర్మధనం చెందుతున్న ఈటెల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కేసీఆర్ ఇక ఈటెలను కట్టడి చేయాలని నిర్ణయించుకొని కేసు మీద కేసు పెడుతూ ఈటెలను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.

ముదిరాజుల బల ప్రదర్శన చేసి కొంచెం తప్పు చేశామేమో అని ఈటెల అంతర్మధనం చెందుతున్నట్టు వార్తలు వినిపించాయి.ఎందుకంటే ఇప్పుడు ఈటెల వెంట ఉన్న నేతలు కడ వరకు ఈటెల వెంట ఉంటారా అంటే చెప్పలేని పరిస్థితి.

ఇప్పుడు వారిని నమ్ముకొని కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే కేసీఆర్ ను తట్టుకొని పార్టీని నిలబెట్టడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు.అందుకే కార్యకర్తల మాదిరిగా తొందర పడకుండా ఆచితూచి అడుగులేయాలని ఈటెల ఆలోచిస్తున్నట్టు సమాచారం.

#@trspartyonline #Eetela Rajendar #@kcrunofficial #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు