ఒక్కడిగా పోరాడుతున్న ఈటెల... ఇక అసలు విషయం బోధపడినట్టేనా

ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత  ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ హాట్ టాపిక్ గా నిలిచిన పరిస్థితి ఉంది.

 Etela Fighting Alone And The Real Thing Being Taught, Etela Rajemdar, Huzurabad-TeluguStop.com

అయితే మొదట కాంగ్రెస్ లో  చేరదామని నిర్ణయించుకున్నా అనివార్య కారణాల వల్ల మరల బీజేపీ వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే బీజేపీలో చేరిన తరువాత ఈటెల రాజేందర్ ఇక పూర్తి స్థాయిలో నియోజకవర్గంపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పని చీసిన అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ కు బీజేపీలో పూర్తి స్థాయి మద్దతు ప్రోత్సాహం దక్కుతుందని ఆశించారు.

అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదనేది అంతర్గతంగా ఈటెల సన్నిహితుల అభిప్రాయం.

అందుకే ఒకప్పుడు ఈటెల ప్రచారంలో పాల్గొన్నంతగా బీజేపీ నాయకులు ఇప్పుడు ఈటెల వెంట పాల్గొనటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈటెలకు పెద్ద ఎత్తున మద్దతు దక్కవలసింది పోయి ఇప్పుడు వ్యక్తిగత ఎజెండాతోనే ఈటెల ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కడా కూడా తన స్పీచ్ లలో బీజేపీ గురించి మాట్లాడేది చాలా తక్కువగా ఉంటూ, వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రజల్లో అభివ్యక్తీకరిస్తూ టీఆర్ఎస్ పార్టీపై, కెసీఆర్ పై విరుచుకపడుతున్న పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, Bjp, Eetela Rajender, Etela Hu

అయితే మరి ఈటెల ప్రస్తుతానికి బీజేపీపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించకున్నా ప్రస్తుతం వ్యక్తిగా తాను గెలవడం ముఖ్యం కాబట్టి ప్రస్తుతానికి గెలుపుపైనే ఈటెల ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాక తనకు గుర్తింపులోకానీ, గౌరవం లోగాని తనకు ఎదురైన అనుభవంతో అసలు విషయం బోధపడిందని వార్తలువినిపిస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube