కేసీఆర్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్న ఈట‌ల‌.. స్ట్రాట‌జీ వ‌ర్కౌట్ అవుతోందిగా

తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత‌లా ప్రభావం చూపుతుందో అంద‌రం చూస్తూనే ఉన్నాం.మొద‌టి నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

 Etala Targeting Only Kcr Strategy Seems To Be Working Out-TeluguStop.com

గ‌తంలో ఏ ఉప ఎన్నిక‌కూ లేనంత పాపులారిటీ కేవ‌లం ఈ ఉప ఎన్నిక‌కు మాత్ర‌మే వ‌చ్చిందంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం కేసీఆర్ ఏకంగా ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్‌ను కూడా తీసుకువ‌స్తున్నారంటే దీనికున్న ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక‌పోతే మొద‌టి నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ అప్ప‌టి నుంచే వాయు వేగంతో దూసుకుపోతున్నారు.పాద‌యాత్ర అంటూ మొదలు పెట్టినా కూడా ఆ త‌ర్వాత దాన్నికొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ప‌క్క‌న పెట్టేశారు.

 Etala Targeting Only Kcr Strategy Seems To Be Working Out-కేసీఆర్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్న ఈట‌ల‌.. స్ట్రాట‌జీ వ‌ర్కౌట్ అవుతోందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర స్థాయిలో తిరుగుతూనే ఉన్నారు.కాగా ఇక్క‌డ ఆయ‌న మొద‌టి నుంచి టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థి అయిన గెల్లు శ్రీనివాస్ గురించి ఎక్క‌డా మాట్లాడ‌కుండా కేవ‌లం సీఎం కేసీఆర్‌ను లేదంటే హ‌రీశ్ రావును మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు.

ఎందుకంటే ప్ర‌జ‌ల్లో కేసీఆర్ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.ఆయ‌న స్ట్రాట‌జీ ఏంటంటే గెల్లు శ్రీన‌వాస్‌ను టార్గెట్ చేస్తే ఆయ‌న హైలెట్ అయిపోతార‌ని అప్పుడు ధ‌న‌వంతుడు అయిన ఈట‌ల‌కు సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి అయిన గెల్లు శ్రీనివాస్‌కు మ‌ధ్య పోటీ అని అంతా ఆయ‌న వైపు సానుభూతి చూపించే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి ఇక్క‌డ బ‌ల‌మైన కేసీఆర్‌ను ముందు చూపించి త‌న‌కు జ‌రిగిన అన్య‌యాన్ని ఆయ‌న అస్త్రంగా వాడేస‌కుంటున్నార‌న్న‌మాట‌.

ఇందుకోస‌మే ఆయ‌న ఎక్క‌డ ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా కూడా కేవ‌లం కేసీఆర్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ మాట‌ల తూటాలు వ‌దులుతున్నారు.రాబోయే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే త‌నను తాను చిన్న వాడిన‌ని కేసీఆర్ చేతిలో మోస‌పోయిన వ్య‌క్తిగా వ్య‌క్తీక‌రించుకుంటున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.ఈ స్ట్రాట‌జీ ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి సానుభూతిని తెప్పించి పెడుతోంది.కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు చేస్తున్న అన్యాయం గురించి ఒక్కొక్క‌టిగా తెలియ‌జేస్తూ ప్ర‌జ‌ల్లో ఆయ‌న ఇమేజ్‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.

చూడాలి మ‌రి ఆయ‌న ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం సాధిస్తారో.

#GalliSrnivas #Harish Rao #Trs #Huzurabad #Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు