జనవరి వరకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ : ట్రంప్

అమెరికాలో కరోనా తాండవిస్తోంది.ప్రపంచదేశాలతో పోల్చితే ఈ దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదుతో పాటు మరణాల సంఖ్య ఎక్కువ.

 Estrogenica, Vaccine, January, Trump-TeluguStop.com

మరణాల నమోదులో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను తొందరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే దేశంలోని పలు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.ఇప్పటికే అమెరికాలో కొన్ని వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయి.

అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా చివరిదశకు చేరుకుంది.ఈ వ్యాక్సిన్ ను తర్వలోనే ఆమోదిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.దేశంలో ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు చివరిదశకు చేరుకున్నాయి.వీటి సరసన ఆస్ట్రాజెనికా కూడా చేరిందన్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో 2021 జనవరిలో అందుబాటులోకి రానుందని ట్రంప్ పేర్కొన్నారు.ఈ మేరకు వ్యాక్సిన్ తయారీకి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

సుమారు 300 మిలియన్ల డోసుల టీకాను తయారు చేయనున్నారు.వ్యాక్సిన్ కోసం అహర్నిషలు శ్రమిస్తున్న పరిశోధకులను, శాస్త్రవేత్తలను ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.

అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశారన్నారు.ఇప్పటివరకు అమెరికా దేశంలో 62 లక్షల కేసులు నమోదు కాగా.1.87 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube