దృశ్యంలో చిన్న పాప అక్కడ హీరోయిన్ అయిపోయింది

చాలా మంది అందాల భామలు 15, 16 ఏళ్లకే హీరోయిన్స్ గా తెరంగేట్రం చేసేస్తారు.అయితే వారు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఉండటంతో అప్పుడే హీరోయిన్ అయిపోయిందా అని భావిస్తూ ఉంటాం.

 Drishyam Girl Esther Anil To Debut As Heroine, Tollywood, Telugu Cinema, South C-TeluguStop.com

అలాగే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి తరువాత అదే ఎన్టీఆర్ తో హీరోయిన్ గా కూడా చేసింది.అలాగే ఒక సినిమాలో బాలకృష్ణ మేనకోడలిగా చేసిన రాశి తరువాత బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించింది.

అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రంభ కూడా తరువాత స్టార్ హీరోయిన్ అయిపొయింది.మలయాళీలో అనూ ఇమాన్యూయేల్, కీర్తి సురేష్ లు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తరువాత హీరోయిన్స్ అయినవారే.

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది.మళయాల స్టార్ మోహన్ లా నటించిన దృశ్యం చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ దృశ్యం తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా చిన్న కూతురుగా మలయాళీ అమ్మాయి ఎస్తేర్ నటించింది.మలయాళీ దృశ్యంలో కూడా ఆమెనే నటించింది.ఈ సినిమా వచ్చి ఆరేళ్ళు అవుతుంది.ఇప్పుడు ఈ చిన్నమ్మాయి టీనేజ్ లోకి వచ్చేసింది.

ఏకంగా హీరోయిన్ గా మారిపోయింది.ప్రస్తుతం మలయాళీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతుంది.

త్వరలో తెలుగులోకి కూడా తెరంగేట్రం చేసే అవకాశం ఉంది.తాజాగా చీరకట్టులో ఎస్తేర్ ని చూసిన అందరూ దృశ్యంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయి అప్పుడే హీరోయిన్ అయిపోయిందా అని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube