మళ్ళీ హీరోయిన్ గా సత్తా చాటే ప్రయత్నంలో ఎస్తర్  

తేజ వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఎస్తర్.ఈ సినిమా తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో ఎస్తర్ హీరోయిన్ గా నటించింది.

TeluguStop.com - Ester Main Lead In Heroine Movie

అయితే అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.నటిగా ఒకే అనిపించుకుంది.

జయ జానకీ నాయకా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.తెలుగులో పెద్దగా సక్సెస్ రాకున్నా మాతృభాష కన్నడలో ఈ భామ బాగానే సినిమాలు చేస్తుంది.

TeluguStop.com - మళ్ళీ హీరోయిన్ గా సత్తా చాటే ప్రయత్నంలో ఎస్తర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పాటు కొంకణీ భాషలో కూడా సినిమాలు చేస్తుంది.అక్కడ ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉంది.

ఇక సింగర్ నోయల్ ని పెళ్లి చేసుకొని కొంత కాలం జర్నీ చేసిన తర్వాత ఈమె విడిపోయింది.గత ఏడాది ఇద్దరికి అఫీషియల్ గా విడాకులు కూడా వచ్చేశాయి.

విడాకుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో బిజీ కావడానికి ఈమె ప్రయత్నాలు మొదలు పెట్టింది.రీసెంట్ గా షకీలా బయోపిక్ లో ఓ కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు లభించాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ గా ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీకి తెలుగులో ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హీరోయిన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ఎస్తర్ నటిస్తుంది.ఈ సినిమా కోసం ఫుల్ స్లిమ్ గా కావడంతో పాటు క్యారెక్టరైజేషన్ ప్రకాశం ఈమె బోల్డ్ గా కూడా నటించబోతుందని తెలుస్తుంది.

ఇందులో ఆమె ఓ అడల్ట్ స్టార్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం.ఆ పాత్ర ప్రకారం సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని, వాటిలో నటించడానికి ఎస్తర్ ఒకే ఒకే చెప్పిందని చిత్ర దర్శకుడు తిరుపతి మీడియా సమావేశంలో తెలియజేశారు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

#Ester Noronha #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు