వెబ్‌ సిరీస్‌ల పేరుతో రెచ్చి పోతున్న తెలుగు బ్యూటీ

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణించడం చాలా అరుదుగా మనం చూస్తున్నాం.ఈషా రెబ్బా పెద్ద హీరోలతో సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది.

 Esha Rebba In One More Web Series-TeluguStop.com

కాని ఈమె స్థాయి యంగ్‌ హీరోల వరకే పరిమితం అయ్యింది.ప్రస్తుతం ఈమె వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటిస్తోంది.

హిందీలో సక్సెస్‌ అయిన లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌లో కియారా అద్వానీ పోషించిన పాత్రను తెలుగులో ఈషా రెబ్బా పోషిస్తోంది.ఈ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది.

భర్తతో సుఖం లభించని ఒక యువతి పాత్రలో ఈషా రెబ్బా కనిపించబోతుంది

ఆ పాత్ర కొన్ని సీన్స్‌ మరీ బోల్డ్‌గా ఉండటంతో పాటు ఎబెట్టుగా కూడా ఉంటాయి.అయితే వెబ్‌ సిరీస్‌ కనుక అవన్నీ నడుస్తాయి.

ఇప్పుడు తెలుగులో కూడా అదే విధంగా ఈషా పాత్రను డిజైన్‌ చేస్తారా లేదా అనేది చూడాలి.ఇక మరో వైపు ఈషా రెబ్బా అచ్చు అదే తరహా కాకున్నా మరో బోల్డ్‌ పాత్రకు ఓకే చెప్పింది.

హైదరాబాద్‌ సిటీ నైట్‌ కల్చర్‌పై స్పీడ్‌ ఏజ్‌ స్టోరీతో సంపత్‌ నంది నిర్మాణంలో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతుంది.ఆ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి

ఈషా రెబ్బా ఆ వెబ్‌ సిరీస్‌లో కూడా నటించేందుకు సిద్దం అయ్యిందట.

ప్రస్తుతం లస్ట్‌ స్టోరీ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈషా రెబ్బా త్వరలోనే కొత్త వెబ్‌ సిరీస్‌ను కూడా మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.భారీ ఎత్తున ఇలాంటి పాత్రలు చేసేందుకు సిద్దం అవుతున్న ఈ అమ్మడు ముందు ముందు మరెంతగా రెచ్చి పోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube