రెస్టారెంట్ లో రెచ్చిపోయిన దున్నపోతు.. వీడియో చూస్తే షాక్..!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు నెలవు.రోజూ ఏదొక వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.

 Escaped Buffalo Bursts Into Restaurant And Tosses Man In The Air, Buffalo Attack-TeluguStop.com

కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటె మరికొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటాయి.అందులో మనకు కొన్ని బాగా నచ్చితే మరి కొన్ని ఇంకా బాగా నచ్చుతాయి.

ఈ వీడియోల్లో ఆశ్చర్యాన్ని కలిగించే వీడియోలు కూడా ఉంటాయి.వీటిని చూస్తే షాక్ అవ్వడం ఖాయం.

అలాంటి వీడియోలు చూసినప్పుడు మనకు కొద్ది సేపు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు.తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో జరిగింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక రెస్టారెంట్ లో దున్నపోతు తెగ హల్ చల్ చేసేసి కస్టమర్లను భయాందోళనకు గురి చేసింది.ఆ దున్నపోతు అనుకోకుండా రెస్టారెంట్ లోకి ప్రవేశించి అక్కడి వారిని ఫుడ్ బాల్ ఆడుకుంది.

ఈ ఊహించని ఘటనలో ఒక వ్యక్తి తృటిలో తన ప్రాణాలను కాపాడు కున్నాడు.చైనా లోని ఒక రెస్టారెంట్ లోకి దున్నపోతు దూసుకు వచ్చింది.ఆ సమయంలో రెస్టరెంట్ లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు.ఒక వ్యక్తి నీళ్లు తాగుతూ ఉన్నాడు.ఒక్కసారిగా వచ్చిన ఆ దున్నపోతు నీళ్లు తాగుతున్న వ్యక్తిని దాని కొమ్ములతో గాల్లోకి ఎగరేసి కుమ్మేసింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడిని ఇంకొక వ్యక్తి వచ్చి వేరే గదిలోకి తీసుకు వెళ్ళాడు.

ఆ తర్వాత గాయపడ్డ ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు.అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.ఈ ఘటన మొత్తం సిసి కెమెరాల్లో రికార్డ్ అవ్వగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అక్కడ దగ్గర లో ఉన్న కబేళా సెంటర్ నుండి ఈ దున్నపోతు తప్పించుకుని వచ్చి రెస్టారెంట్ లోకి దూరి నానా హంగామా చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube