munugodu by-elections : ఆర్యవైశ్య, వర్తక వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్ రావు

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు లో ఈ రోజు రాత్రి జరిగిన ఆర్యవైశ్య, వర్తక వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఆత్మీయ అతిథులు హాజరైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పాల్గొన్న ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు, ఆర్య వైశ్యులు, వర్తక వ్యాపారులు, ఆయా సంఘాల నాయకులు వైశ్య పురాణం ప్రకారం వైశ్యుల మూల పురుషుడు కుబేరుడు వ్యాపారం, వ్యవసాయం వారి వృత్తులుఈ పక్క నుండే పారే కృష్ణా నది తీరంలో వర్తక వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తాడట.ఇప్పటికీ కృష్ణా నది తీరంలో అక్కడక్కడా నిధులు బయటపడుతుంటాయని చెబుతారు.

 Errabelli Dayakar Rao Was The Chief Guest At The Atmiya Sammelanam Program Of Ar-TeluguStop.com

అంటే మీరంతా కుబేరుడి వారసులే ఇది మనమంతా గర్వించదగ్గ విషయం.దాన గుణంలో వైశ్యులని మించినవారు లేరు.

అన్నదానంలో, విద్యాదానంలో చాలా గొప్పవారు.వైశ్యులంటే పిరికి వాళ్ళని, ధైర్యం తక్కువ వాళ్ళని అంటారు.

కానీ, యుద్ధాల్లోనూ వైశ్యులు ఆరితేరిన వారిగా పేరుంది.బొబ్బిలి యుద్ధంలో కోమటి బిడ్డ బేరి రామక్క రాళ్ళతో తన పరాక్రమాన్ని చాటిందని ఉంది.

తెలంగాణ ఉద్యమంలో కూడా మంచి పాత్ర పోషించారు.రాను రాను వృత్తుల మధ్య, కులాల మధ్య తేడాలు పోతున్నాయి అందరూ అన్ని వృత్తులు చేపడుతున్నారువ్యాపార రంగంలో వెనుకటికి కేవలం వైశ్యులు మాత్రమే ఉండేది.ఇవ్వాళ అన్ని కులాల వారు వ్యాపార రంగంలో ఉన్నారువ్యాపారం కేవలం లాభం కోసం చేసేది అయినా, ఇవ్వాళ వ్యాపారులు లాభం తో పాటు సేవ, రాజకీయ లక్షణాలను అందుకున్నారుఆయా రంగాల్లోనూ రాణిస్తున్న వారున్నారువర్తక, వ్యాపారులకు సీఎం కెసిఆర్ అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నార నైపుణ్యాల పెంపు, ఉపాధి శిక్షణ అందులో భాగమే ఐటీ అంకురాల కోసం టీ హబ్, వి హబ్ లు పెట్టారుసింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలకు అనుమతులుకొత్త పారిశ్రామిక వేత్తలకు నిధులు 24 గంటల కరెంట్, నీరు, భూమి వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు

తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు స్వర్గంగా మారింది సీఎం కెసిఆర్ ముందుచూపు, మంత్రి కేటీఆర్ ల చొరవతో వచ్చిన కంపెనీ ల వల్ల ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు దొరుకుతున్నాయిమల్టీ నేషనల్ కంపెనీలు పెట్టుబడులు హైదరాబాద్ లోనే పెడుతున్నాయిదేశాన్ని సాదే స్థాయికి తెలంగాణ చేరింది సమృద్ధిగా నీరు వచ్చింది మన రాష్ట్రం నుండే అత్యధికంగా దేశానికి ఆదాయం వస్తున్నది ప‌న్నుల రూపంలో ఇచ్చిన కోట్ల‌ను కొల్ల‌గొట్టి… మనకు రావాల్సిన వాటాను కేంద్రం ఎగ్గొదుతున్నదిపెన్ష‌న్లు కూడా కేంద్రం కేవ‌లం 215కోట్లు ఇస్తుంటే,మన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 12 వేల 500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నది మీరేక్క‌డైనా మాలా ఇస్తున్న‌రా? రాష్ట్రానికి రావాల్సింది 3వేల 600 కోట్లు… కానీ, రాష్ట్రానికి ఇచ్చింది 1 వెయ్యి 916 కోట్లు మాత్ర‌మే

మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన 7,184 కోట్ల ను కేంద్రం ఇవ్వడం లేదు GST పరిహారం 2,247 కోట్లు రావాలి15 వ ఆర్థిక సంఘం నిధులు 1103 కోట్లు ఎప్పుడు ఇస్తారు? 2014-15 నుంచి నేటి వరకు 3,65,797 కోట్లు చెల్లిస్తే, రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 2,68,647 కోట్లు మాత్రమే!GST పన్నులు అయితే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని, 26.9 శాతం కు కుదించి, సెస్సు ల రూపంలో రాష్ట్రాల నుంచి డబ్బులు గుంజుతుంది కేంద్రం కాదా? 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టినా సిగ్గులేని ప్రభుత్వం బీజేపీ దిబీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన లాంటి పథకాలు అమలు అవుతున్నాయా?వర్తక వ్యాపారులు కష్ట పడి పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదించి, రకరకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారప్రభుత్వాలు నడవడానికి చోదక శక్తి మీరుమీరే అందరికంటే ఎక్కువగా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలిమీకు, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాలకు మద్దతు పలకాలి మన పట్ల మన సీఎం కెసీఆర్ కు ఉండే ప్రేమ ఎక్కడో ఢిల్లీ వాళ్లకు ఉంటదా?విశ్లేషించండి! ప్రభుత్వానికి మద్దతుగా నిలవండిసారు, కారు, సర్కారే మనకు శ్రీరామ రక్ష!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube