ధోనిని ఘోరంగా అవమానించారు పాపం

మహేంద్ర సింగ్ ధోని – కెప్టెన్ కూల్ .ఇటు భారత క్రికేట్ చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ లీగ్ అయిన ఐపియల్ లో కూడా అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరుకెక్కాడు.

 Epic Insult – Dhoni Removed From Pune Captaincy-TeluguStop.com

ఇప్పటివరకూ 9 ఐపియల్ ఎడిషన్స్ జరిగితే, అందులో 8 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి నాయకత్వం వహించిన ధోని, తన జట్టుని ఎనిమిదికి ఎనిమిది సార్లు ప్లే ఆఫ్స్ కి తీసుకురావడంలో సఫలమయ్యాడు.అంతే కాదు, ఏకంగా ఆరుసార్లు ఫైనల్ దాకా తీసుకెళ్ళి, రెండుసార్లు విజేతగా నిలిపాడు.

మొత్తం మీద చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్.

అయితే చెన్నై జట్టు రెండేళ్ళ పాటు ఐపియల్ నుంచి సస్పెండ్ కావడంతో ధోనిని కొత్తగా వచ్చిన పూణే జట్టు చేజిక్కించుకుంది.

గత ఏడాది తొలిసారి రైజింగ్ పూణే సూపర్ జాయంట్స్ కి నాయకత్వం వహించిన ధోని, తొలిసారి విఫలమయ్యాడు కూడా.గత ఐపియల్ లో ధోని జట్టు చివరి నుంచి రెండొవ స్థానంలో నిలిచి తొలిదశలొనే ఇంటిముఖం పట్టింది.

చెన్నైకి నాయకుడిగా ధోని విజయాల శాతం 60.47% కాగా, పూణే తరపున మాత్రం విజయాల శాతం కేవలం 35.71%.దాంతో పూణే టీమ్ యాజమాన్యం ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.కెప్టెన్సి పదవి నుంచి ధోనిని తొలగిస్తున్నట్లు నిన్న ప్రకటించింది.ఐపియల్ చరిత్రలో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌ ని ఇలా తొలగించి అవమానపరచటంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది రైజింగ్ పూణే టీం.పాపం ధోని .ఈమధ్యే భారత జట్టు పగ్గాలు వదిలిపెట్టాడు, ఇంతలోనే ఐపియల్ లో ఓ జట్టుకి నాయకత్వం వహించే అవకాశం కోల్పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube