పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పని చేయొద్దంటూ హెచ్చరిక..!

మీరు ఉద్యోగం చేస్తున్నారా.? అయితే మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా ఉంటే ఇది మీరు తప్పని సరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.అంతేకాకండా ఈపీఎఫ్‌వో తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేశారు.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాల మంది జీవనోపాధిని కోల్పోయారు.అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు.

 Alert For Pf Clients Warning While Doing That Thing   Epf,epfo, Aadhar, Pan Card-TeluguStop.com

అంతేకాదు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు హెచ్చరికను జారీ చేసింది.

అయితే పీఎఫ్ ఖాతాదారులు వారి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దన్నారు.

ఖాతా వివరాలు ఫోన్ ద్వారా కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ ఎవ్వరికీ తెలియజేయొద్దు అని వెల్లడించారు.మీరు చేసే చిన్న తప్పుతో మీ ఆకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారని హెచ్చరికలు చేసింది.

అంతేకాదు మీకు ఎలాంటి సమస్య వచ్చిన కానీ, ఉన్న కానీ వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.అంతేకాక 1800118005 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అని తెలిపారు.

ఇక మీ ఆధార్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ద్వారా లేదంటే ఫోన్ ద్వారా ఎవరికీ ఇవ్వకూడదని తెలిపారు.అంతేకాక ఈపీఎఫ్‌వో ఎవ్వరినీ వారి వ్యక్తిగత వివరాలను అందించాలని అడగదు అని సోషల్ మీడియా ఖాతా ద్వారా సందేశాన్ని పంపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube