ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా విడిపోతున్నారు  

Entire Team Of Zindagi Na Milegi Dobara Broken Up -

జిందగీ నా మిలేగి దోబారా అనే సినిమాను ఇక్కడ అందరు చూసే ఉంటారు కదా.హృతిక్ రోషన్, కత్రిన కైఫ్, ఫర్హాన్ అఖ్తర్.

కల్కి, అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా 2011 లో విడుదల అయ్యింది.యువతను బాగా అక్కట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Entire Team Of Zindagi Na Milegi Dobara Broken Up--Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఈ సినిమాలో నటించినవారందరి వ్యక్తిగత జీవితం ఏమాత్రం బాగాలేదు.ఇది విచిత్రమో,యాదృచ్చికమో తెలియదు కాని, అందరు తమ తమ భాగస్వాములతో విడిపోయారు.

ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా చేసిన కల్కి కొచ్లిన్ ప్రముఖ బాలివుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని 2011లో పెళ్లి చేసుకొని గత ఏడాదే విడిపోయింది.ఇక అగ్రహీరో హృతిక్ రోషన్ కూడా తన భార్య సుజానే కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అభయ్ డియోల్ తన ప్రేయబంధాన్ని తెంచుకాగా, పెళ్లి దాకా వెళ్లి కత్రినా రణబీర్ తో రిలేషన్ ని కట్ చేసుకున్న సంగతి ఇప్పుడు ఒక హాట్ న్యూస్.ఇక తాజాగా ఫర్హాన్ అఖ్తర్ తన 15 ఏళ్ల వివాహ బంధానికి తెరదించనున్నాడు.

తన భార్య అధునకి ఫర్హాన్ విడాకులు ఇస్తున్నాడు.ఈ రకంగా జిందగీ నా మిలేగి దోబారా తారాగణమంతా సింగిల్ స్టేటస్ కి షిఫ్ట్ అయిపోయారు.

తాజా వార్తలు

Entire Team Of Zindagi Na Milegi Dobara Broken Up- Related....