మంచివాడా మరోసారి ఆలోచించుకో..!  

Enthamachivadavura Team Unit Thinking About Movie Hit Or Flop - Telugu Ala Vaikuntapuramlo, Enthamachivadavura, Enthamachivadavura Team Unit Thinking About Movie Hit, Kalyan Ram Enthamanchivaduvura, Mahesh Babu Sarileru Nikevvaru

మూడు నాలుగు నెలలుగా సంక్రాంతి సినిమాల గురించి తెగ హడావుడి జరిగింది.అదుగో ఇదుగో అంటూ తెగ ప్రచారం జరిగింది.

Enthamachivadavura Team Unit Thinking About Movie Hit Or Flop

ఇప్పుడు సంక్రాంతి సీజన్‌ వచ్చింది.ఇప్పటికే దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ మూడు సినిమాలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.ఇప్పుడు అంతా కూడా ఎంత మంచి వాడవురా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఎంత మంచి వాడివి సినిమాను సతీష్‌ వేగేశ్న తెరకెక్కించాడు.

భారీ ఎత్తున అంచనాలున్న సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం జనాల చాయిస్‌ అయ్యాయి.పండుగకు ఒకటి లేదా రెండు సినిమాలు చూడాలి అనుకుంటారు.

కాని ఎక్కువ సినిమాలు విడుదల అయితే జనాలు అన్ని చూడటం కష్టమే.ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకున్న ఈ చిత్రాల పోటీకి ఎంత మంచి వాడవురా చిత్రం రాబోతుంది.

మూడు సినిమాల పోటీకి ఎంత మంచివాడవురా చిత్రం రాబోతుంది అంటే చాలా పెద్ద సాహస నిర్ణయం అంటున్నారు.సినిమాపై చాలా నమ్మకం ఉంటే తప్ప ఇంత పోటీలో రావడం సాధ్యం కాదు.మరి వారిది నమ్మకం అయితే పర్వాలేదు అతి నమ్మకం అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు.అందుకే ఎంత మంచివాడవురా చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి ఆలోచించుకోవాలి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test