ఇక నుంచి సినిమా చూపించనున్న రైల్వే అధికారులు...  

Indian Railways Planning To Give More Entertainment In Trains-india,indian Railways,indian Railways Entertainment,indian Railways Latest News,indian Railways News,trains Entertainment Facility

దేశంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది.ఇప్పటికే ఇందులో భాగంగా పలుచోట్ల వైఫై, ఐదు రూపాయలకే డ్రింకింగ్ వాటర్, ఈ టికెట్ వంటి అంశాలను అమలులోకి తెచ్చి ప్రయాణికుల మన్ననలు పొందుతోంది.

Indian Railways Planning To Give More Entertainment In Trains-India Indian Latest News Trains Facility

అయితే తాజాగా రైల్లో ప్రయాణం  చేసేటువంటి వారికి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇందులో భాగంగా పలు రైళ్ల బోగీలలో టీవీలను అమర్చి విద్యా సంబంధిత వీడియోలు మరియు వార్తలు, ఎంటర్ టైన్మెంట్ వంటి వాటిని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది భారత రైల్వే శాఖ.

అయితే ఇందుకు గాను ఇప్పటికే భారత రైల్వే శాఖకు అనుబంధ సంస్థ అయినటువంటి రైల్ టెల్ సంస్థ ఈ సేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇందులో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి పలు చానళ్లు ఆధారంగా ఈ ప్రసారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో కొన్ని ఉచితంగా ఉన్నప్పటికీ మరింత డబ్బులు వెచ్చించి కొత్త సినిమాలు వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇది కేవలం స్లీపర్, ఏసీ సంబంధిత బోగీల్లో మాత్రమే ఈ సదుపాయం ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే దాదాపుగా ఎనిమిది వేల పైచిలుకు రైల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రసారాలు చేయడానికి టీవీలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే పలు బస్సుల్లో ప్రయాణికులను ఆకట్టుకోవడానికి టీవీ లను ఏర్పాటు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు బస్సు యజమానులు.

దీంతో రైల్వే రంగం కూడా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

.

తాజా వార్తలు

Indian Railways Planning To Give More Entertainment In Trains-india,indian Railways,indian Railways Entertainment,indian Railways Latest News,indian Railways News,trains Entertainment Facility Related....