నగిరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.
రోజా గారు తన సోదరులు కుమార్ స్వామి రెడ్డి గారితో సోమవారం పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్ లో సరదాగా పోటీ పడడం ఆహుతులను అలరించింది.
పుత్తూరు మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ క్రీడ సంబరాలలో భాగంగా షటిల్ బాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా గ్రామీణ క్రీడా సంబరాలు ప్రారంభిస్తూ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా గారు తన సోదరుడు కుమారస్వామి రెడ్డి గారితో సరదాగా షటిల్ బాడ్మింటన్ ఆడారుఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.