విధ్వంసం సృష్టిస్తున్న కార్తికేయ 2.. అంతటా భారీ క్రేజ్!

తెలుగులో టైర్ 2 హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఉన్నారు.నిఖిల్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రేక్షకుల చేత గుర్తింపు పొందాడు.

 Enormous Number Of Screens Increased For Karthikeya 2, Karthikeya 2, Nikhil Sidd-TeluguStop.com

ఇక ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో కార్తికేయ 2 కూడా ఉంది.నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేసాడు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈసారి కూడా నిఖిల్ కు తాను ఎదురు హిట్టే రావడంతో మరింత సంతోషంగా ఉన్నాడు.

ఆగష్టు 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ముందు నుండి కూడా నిఖిల్ తో పాటు టీమ్ కూడా ఈ సినిమా విజయం మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

వీరి కాన్ఫిడెంట్ బాగానే వర్కౌట్ అయ్యింది.ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

అలాగే ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే కుమ్మేయడంతో అందరి ద్రుష్టి ఈ సినిమా మీదకు మళ్లింది.

Telugu Chandu Mondeti, Karthikeya, Tollywood-Movie

ఈ సినిమాకు మన ఇండియాలోనే కాదు.ఓవర్సీస్ లో సైతం మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్ల సంఖ్య భారీగా పెంచుతున్నారు.నార్త్ లో అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది.

మూడు రోజుల్లోనే భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకు పోతుంది.మొత్తంగా నిఖిల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube