వైసీపీతో శత్రుత్వమే అంటున్నా... బీజేపీ ని నమ్మరే ?

2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీతో బిజెపి సన్నిహితంగానే మెలుగుతూ వచ్చింది.ఎన్నికల సమయంలో వైసిపికి అన్ని విధాలుగా సహకరించింది.

 Enmity With Ycp Do You Trust Bjp ,  Ysrcp, Bjp, Tdp, Chandrababu, Jagan Bangaru-TeluguStop.com

గతం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతో బిజెపికి రాజకీయ శత్రుత్వం ఉండడం , మళ్ళీ టిడిపి ఏపీలో అధికారంలోకి రాకుండా చేయాలనే పట్టుదలతో బిజెపి అగ్ర నేతలు ఉండడం తదితర కారణాలతో  ఎన్నికల సమయంలో జగన్ కు అన్ని విధాలుగా వైసిపి సహకారం అందించింది.అనుకున్నట్లుగానే వైసిపి ఏపీలో అధికారంలోకి వచ్చింది.

ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్ కు కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందించింది.ఇప్పటికీ అందిస్తూనే వస్తుంది .పూర్తిగా బిజెపి అగ్ర నాయకులు ఏపీ బీజేపీ నాయకులు టిడిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే టిడిపి విషయంలో సానుకూలంగా లేకపోయినా,  వైసిపి పై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  నిర్ణయాలను తప్పుపడుతున్నారు.అసలు ఏపీలో అభివృద్ధి చోటు చేసుకోలేదు అంటూ బిజెపి అగ్ర నేతలు నుంచి రాష్ట్రస్థాయి నాయకులు వరకు విమర్శలు చేస్తున్నారు.

దీంతో వైసిపి , బిజెపి మధ్య స్నేహ సంబంధాలు లేవని , రెండు పార్టీల మధ్య శత్రుత్వం ఉందనే విధంగా పరిస్థితి తయారయింది.అయితే ఇదంతా పైకి మాత్రమేనని,  బిజెపి – వైసిపిల మధ్య సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
 

 దీనికి తగ్గట్లుగానే కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ కు అన్ని విధాల సహకరించడంతో పాటు , కొత్తగా అప్పులు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వడం, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఏపీకి వచ్చేలా చూడడం తో పాటు, అన్ని విషయాల్లోనూ కేంద్ర బిజెపి పెద్దలు జగన్ ప్రభుత్వానికి సహకారం అందిస్తూనే వస్తున్నారు.బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్  ఉన్న డాక్టర్ లక్ష్మణ్ గత కొద్ది రోజులుగా ఏపీలో పర్యటిస్తూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు అమరావతికి బిజెపి మద్దతు ఉంటుందని అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది అని విమర్శలు చేస్తున్నా…వైసీపీ విషయంలో బీజేపీ ని నమ్మేలా ఎవరూ కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube