గ్రహాంతర వజ్రం వేలం.. స్టార్టింగ్ ధర ఎంతో తెలుసా?

భూమిపై చాలా విలువైన వస్తువులు ఉన్నాయి.బంగారం, వెండి, వజ్రాలు ఇలా అనేక విలువైన వస్తువులను భూమి తనలో దాచు కుంటుంది.

 Enigma Black Diamond Details And Auction Price, Auction, Black Diamond, Enigma,-TeluguStop.com

వీటిని మానవులు తమ అవసరాల కోసం భూమిని తవ్వి మరి బయటకు తీస్తారు.వీటికి చాలా ఖరీదు ఎక్కువుగా ఉంటుంది.

బంగారం, వెండి కంటే వజ్రాలు మరింత ఖరీదైనవి.ఇవి మాములు ప్రజలు వాడలేరు.

ఎందుకంటే వీటి ఖరీదు లక్షల్లో మొదలై కోట్లలో వరకు ఉంటుంది.భూమిలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో కర్బన సమ్మేళనాల కలయిక కారణంగా వజ్రాలు ఏర్పడతాయి.

ఇప్పుడు టెక్నాలిజీ పెరిగిన తర్వాత కృత్రిమంగా కూడా వజ్రాలను ల్యాబ్ లలో తయారు చేస్తున్నారు.ఈ వజ్రాలు కూడా అనేక రంగుల్లో దొరుకుతాయి.

వీటిల్లో బ్లాక్ వజ్రాలు అరుదుగా దొరుకుతాయి.ఇవి అరుదైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడతాయట.

ఇక తాజాగా ప్రముఖ వజ్రాల వేలం సంస్థ సోత్ బే ఖగోళానికి చెందిన ఒక వజ్రాన్ని వేలం వేయబోతుందట.లండన్ లో ఫిబ్రవరి 22న ఈ వజ్రాన్ని వేలం వేయబోతున్నారు.

గ్రహ శకలాలు భూమిని తాకినప్పుడు ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.ఆ తర్వాత వాతావరణం చల్లబడడం వల్ల ఇలాంటి వజ్రాలు ఏర్పడుతాయట.

ఇలాంటి వజ్రాలను ఎనిగ్మా అని పిలుస్తారు.555.55 క్యారెట్ల బరువైన ఈ వజ్రం 55 ముఖాలను కలిగి ఉందట.కార్బోనాడోగా అని పిలవబడే ఈ నల్లని వజ్రాలు బ్రెజిల్, ఆఫ్రికా లో మాత్రమే అరుదుగా దొరుకుతాయి.

ఇక ఈ అరుదైన వజ్రాన్ని లండన్ లో వేలం వేయబోతున్నారు.ఇక ఎనిగ్మా వజ్రం స్టార్టింగ్ ధర 50 కోట్ల రూపాయలుగా ఉంటుందని వేలం నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ వేలంలో పాల్గొనడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ వజ్రం ధర వేలంలో ఎంత పలుకుతుందో వేచి చూడాల్సిందే.

Enigma Black Diamond Details And Auction Price, Auction, Black Diamond, Enigma, Price, Southby, Enigma Black Diamond - Telugu Black Diamond, Enigma, Enigmablack, Southby

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube