జాబ్‌ ఆఫర్‌ చేసిన యువతి... పనేంటో, జీతం ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తూ అప్లై చేస్తారు  

ప్రపంచంలో ఎన్నో రకాల జాబ్‌లు ఉన్నాయి. అయితే కొన్ని జాబ్‌లు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని జాబ్‌లకు పెద్దగా శారీరక కష్టం లేకుండానే లక్షలు సంపాదిస్తూ ఉంటారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు చేసే కొన్ని గంటల పనికి లక్షల్లో జీతంను తీసుకుంటూ ఉంటున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలోనే ఒక యువతి అమ్మాయి లేదా అబ్బాయికి ఒక అద్బుతమైన జాబ్‌ ఆఫర్‌ చేసింది. ఏమాత్రం కష్టం లేకుండా, కేవలం ఆలోచనతో తనకు సాయంగా ఉండాలని, అందుకు తాను రెండు లక్షల జీతం ఇస్తానంటూ ప్రకటించింది. ఇంతకు ఆమె ఎవరు, ఆమె ఎందుకు అంత జీతం ఇస్తానంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్‌కు చెందిన ఒక యువతి కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లిందట. అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా తీసుకు వెళ్లిన డబ్బు అంతా ఖర్చు అయ్యింది. ఆ తర్వాత స్నేహితురాలి వద్ద తీసుకున్న అప్పు డబ్బులను పోగొట్టుకున్నాను. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఒక వ్యక్తితో ఆరు నెలల పాటు సంబంధం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకు వచ్చాను. ఆ తర్వాత అతడిని కూడా వదిలేసి మళ్లీ ఇబ్బందులు పడ్డాను. నా జీవితంలో నేను ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. అందుక కారణం నేను సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడమే అనేది అందరి వాదన.

England Women Offers Variety Job-

England Women Offers Variety Job

నేను సరైన నిర్ణయాలు తీసుకోలేను అంటూ మా అమ్మ కూడా నాపై జోకులు వేస్తుంది. అందుకే నాకు ఎవరైనా నెల రోజుల పాటు మంచి సలహాలు ఇస్తే వారిని పర్మినెంట్‌గా నాకు సలహాదారుడిగా పెట్టుకుంటాను. అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఒక జాబ్‌ పోర్టల్‌లో యాడ్‌ ఇచ్చింది. తనకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా సలహా ఇవ్వాల్సిందిగా ఆమె చెప్పింది. నెల రోజుల పాటు మీరు ఇచ్చే సలహాల వల్ల నాకు మంచి జరిగింది అనిపిస్తే తప్పకుండా మీకు నెలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి మరీ ఉద్యోగం ఇస్తాను అంది.

ఈ ఉద్యోగంను నా వద్దకు వచ్చి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం ఉన్న చోటే ఉండి నాతో కమ్యూనికేట్‌ చేస్తూ జాబ్‌ చేసుకోవచ్చు అంటూ ఆమె చెప్పింది. ఇప్పటికే ఈజాబ్‌ కోసం కొన్ని వందల దరకాస్తులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. పాపం మెకు ఏమైనా సాయం చేసేందుకు ఎవరైనా దొరుకుతారో చూడాలి. మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే వెంటనే బర్క్‌ డాట్‌ కామ్‌ వెబ్‌ సైట్‌ లో సెర్స్‌ చేసుకోండి.