ఆ మ్యాచ్ లన్ని టీంఇండియానే గెలుస్తుదంటున్న ఇంగ్లాండ్ స్పిన్నర్..!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలవంతమైన జట్టు ఏది అంటే అందరూ చెప్పేది ఒక్కటే “టీమిండియా” అని.ఎందుకంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది.

 England Spinner Who Is Winning All Those Matches By Team India , England Team, I-TeluguStop.com

బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.ఇక ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

ఇంగ్లాండ్ లో మొదటగా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడనుంది.ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది.

అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ ను భారత జట్టే గెలుస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ కూడా టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు.

ఇంగ్లాండ్ లో ఉండే క్రికెట్ పిచ్‌ లు ఆగస్ట్ నెలలో స్పిన్ కి బాగా అనుకూలిస్తాయని పనేసర్ చెప్పాడు.ఒక వేళ అలా జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడేవారు తక్కువగా ఉన్నారని, కెప్టెన్ రూట్ మినహా మిగతా వారు స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోలేరని పనేసర్ అభిప్రాయపడ్డాడు.పిచ్ ఎలాంటిదైనా భారత జట్టే గెలుస్తుంది.

ఎందుకంటే అన్ని విభాగాల్లో టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది అని వివరించాడు.

టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది.

జూన్ 18 నుంచి జూన్ 23 వరకు సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌ తో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌‌ మ్యాచ్ ఆడుతుంది.ఆ తర్వాత దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకుని.

ఇంగ్లాండ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది.ఇంగ్లాండ్ తో జరిగే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు జరగనుంది.

Telugu Cricketer, England, Indian, Ups-Latest News - Telugu

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.

-> కేఎల్ రాహుల్, సాహాలను ఫిట్‌నెస్‌ లో పాసయ్యాక ఎంపిక చేయనున్నారు.

-> స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube