ఇప్పుడు ఎందుకు.. ఇండియాలో వందేళ్ల క్రితం జరిపిన నరమేధంకు క్షమాపణలు చెప్పిన ఇంగ్లాండ్‌

భారత దేశంలోకి వ్యాపారం నిమిత్తం వచ్చిన ఆంగ్లేయులు మెల్ల మెల్లగా ఇండియాలోని చిన్న చిన్న రాజ్యాలను, సామంత రాజ్యాలను ఆక్రమించుకుని రాజ్య పాలన తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున ఆర్మీని తీసుకు వచ్చి మన దేశంను ఆక్రమించుకున్నారు.

 England Says Sorry To India About Bullet Fire In 1919-TeluguStop.com

బ్రిటీష్‌ వారి పరిపాలనలో అత్యంత దారుణమపై పరిస్థితులను అప్పట్లో భారతీయులు అనుభవించారు.ఇంగ్లాండ్‌ వారి నుండి స్వాతంత్య్రం కోసం కొన్ని వేల మంది ఉద్యమం చేసి ప్రాణాలు వదిలారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన ఘటనగా జలియన్‌ వాలా బాగ్‌ గురించి చెప్పుకుంటూ ఉంటారు.

1919 ఏప్రిల్‌ 13వ తేదీన జరిగిన ఈ సంఘటన ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లాండ్‌ తీరును తప్పు బట్టింది.స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా పంజాబ్‌లోని జలియన్‌ వాలా బాగ్‌ అనే ప్రాంతంలో శాంతియుతంగా సమావేశం అయ్యి చర్చించుకుంటున్నారు.దాదాపు 20 వేల మంది సమావేశం అయిన ఆ మీటింగ్‌ శాంతి యుతంగా జరుగుతోంది.

స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఎలాంటి కార్యచరణ జరపాలని అంతా చర్చించుకుంటున్నారు.

ఆ సమయంలో చుట్టు దారులు మూసి వేసి జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలో బ్రిటీష్‌ ఆర్మీ జలియన్‌ వాలా బాగ్‌ మైదానంలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులకు తెగ బడ్డారు.బయటకు వెళ్లే మార్గం లేక 20 వేల మందిలో కొందరు బెల్లెట్లకు, కొందరు తొక్కిసలాటలో మరి కొందరు అక్కడే ఉన్న బాయిలో దూకి చనిపోయారు.

అధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మంది ఆ దారుణంలో చనిపోయారు.అయితే అనధికారిక లెక్కల ప్రకారం మూడు వేల మంది వరకు చనిపోయి ఉంటారు.ఆ బాయిలో వందల కొద్ది శవాలు బయట పడ్డాయి.

అంతటి ఘోర కలికి వంద ఏళ్లు పూర్తి కాబోతుంది.ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని థెరెస్సా అప్పట్లో జరిగిన సంఘటనకు ఇండియాకు క్షమాపణలు చెప్పింది.ఆ రోజున జలియన్‌ వాలా బాగ్‌లో జరిగిన దారుణంకు చింతిస్తున్నాం, అలా జరగకుండా ఉండాల్సింది అంటూ ఆమె తన ప్రసంగంలో పేర్కొంది.వందేళ్ల తర్వాత తాము చేసింది తప్పని ఇప్పుడు వారికి ఎందుకు అనిపించిందో వారికే తెలియాలి.అప్పుడు నరమేధం సృష్టించి ఇప్పుడు క్షమాపనలు చెబితే ప్రయోజనం ఏంటి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube