ధోని రికార్డును బద్దలుగొట్టిన బట్లర్.. ఏకంగా 19 సిక్స్‌లు

నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ బ్యాట్‌తో విరుచుకు పడ్డాడు.ఈ సిరీస్‌లో బట్లర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 248 పరుగులు చేశాడు.

 England Jos Buttler Beats Mahendra Singh Dhoni Record With 19 Sixes Details, Ms-TeluguStop.com

సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌లు చేసిన అత్యధిక పరుగులు ఇవే.తొలి మ్యాచ్‌లో అజేయంగా 162 పరుగులు చేశాడు.అదే సమయంలో రెండో వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.ఇక మూడో వన్డేలో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.దీంతో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 17 ఏళ్ల రికార్డును బట్లర్ తిరగరాశాడు.

జోస్ బట్లర్ వన్డే సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.బట్లర్ నెదర్లాండ్స్‌పై మొత్తం 19 సిక్సర్లు బాదాడు.ఈ విషయంలో మహేంద్ర ధోనీని అధిగమించాడు.భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధోని 2005లో శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు సాధించాడు.17 ఏళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ మొత్తం 17 సిక్సర్లు కొట్టాడు.ఈ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు.

Telugu Sixes, Ab Devilliers, Mahendrasingh, Buttler Sixes, Dhoni, Englandjos, La

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా, డివిలియర్స్ ఒక వన్డే సిరీస్‌లో మొత్తం 16 సిక్సర్లు కొట్టాడు.ఇక ఐపీఎల్‌లోనూ జోస్ బట్లర్ విధ్వంసకర రీతిలో బ్యాటింగ్ చేశాడు.ఏకంగా నాలుగు సెంచరీలు కొట్టాడు.ఏ ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో పరుగుల వరద పారించాడు.అయితే అతడు ప్రాతినిథ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ పోరులో చతికిల పడింది.ఆ సమయంలో బట్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube