నువ్వు తోపు బాసూ : పబ్లిక్‌గా అపరిచితురాలికి రైల్లో ముద్దు పెట్టి కోర్టులో ఏం చెప్పాడో తెలుసా  

England Foot Ball Player Paul Gascoigne Kissed A Woman On Train - Telugu Case File On Court, England Foot Ball Player, , He Kissed A Women, Lawyer Mindi Blacked When He Says Truth, Some Members Teased A Women Thats Why Iam Kissed A Women

పబ్లిక్‌గా ఒక లేడీని ముద్దు పెట్టుకున్న వ్యక్తి తాను చేసింది తప్పు కాదు అంటూ చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.ఆమె కోసం తాను చేశానంటూ కోర్టులో అతడు వినిపించిన వాదనలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

England Foot Ball Player Paul Gascoigne Kissed A Woman On Train

ఆయన వాదనలు విన్న కోర్టు కూడా అతడి ప్రవర్తనను సమర్థించే స్థితిలో ఆయన వాదనలు ఉన్నాయంటే ఆయన ఏ స్థాయిలో తన వాదనలు వినిపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కోర్టు మాత్రమే కాదు మీరు కూడా ఆయన వాదనలు విన్న తర్వాత అతడిని సమర్ధిస్తారేమో.

 పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇంగ్లాండ్‌కు చెందిన పాల్‌ గ్యాస్కోయినే అనే 52 ఏళ్ల మాజీ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ ప్రస్తుతం సామాన్యమైన జీవితంను గడుపుతున్నాడు.ఒకప్పుడు ఫుట్‌బాల్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ఆయన ఇప్పుడు మాత్రం సామాన్యమైన వ్యక్తిగా జనాల్లో ఉంటున్నాడు.కొన్నాళ్ల క్రితం ఈయన ఒక ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాడు.ఆ సందర్బంగా తాను ప్రయాణిస్తున్న బోగీలోనే కాస్త దూరంగా కూర్చుని ఉన్న మహిళను పాల్‌ ముద్దు పెట్టుకున్నాడు.ఒకరికి ఒకరు అస్సలు తెలియదు.

నువ్వు తోపు బాసూ : పబ్లిక్‌గా అపరిచితురాలికి రైల్లో ముద్దు పెట్టి కోర్టులో ఏం చెప్పాడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని రైల్లో ఎంతో మంది చూస్తుండగా ముద్దు పెట్టేశాడు.

 పాల్‌ ముద్దు పెట్టడంపై ఆమె చాలా సీరియస్‌ అయ్యింది.పబ్లిక్‌గా ముద్దు పెడతావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేసింది.మహిళను పబ్లిక్‌గా ఇష్టం లేకున్నా ముద్దు పెట్టుకున్న కారణంగా పాల్‌పై కేసు నమోదు చేశారు.

కేసు విచారణ కోర్టుకు మారింది.కోర్టు విచారణలో పాల్‌ ముద్దు పెట్టుకున్న విషయంను ఒప్పుకున్నాడు.

అయితే ముద్దు పెట్టుకున్నందుకు గల కారణం విన్న తర్వాత ఆ కారణంకు మీరు కన్విన్స్‌ కాకుంటే అప్పుడు నన్ను దోషిగా శిక్షించండి అంటూ పాల్‌ కోర్టును కోరాడు.

 కోర్టులో పాల్‌ మాట్లాడుతూ.రైల్లో నా పక్కన ఉన్న వారు కొందరు ఆమె గురించి కాస్త అసభ్యంగా మాట్లాడారు.ఆమె మరీ లావుగా ఉందని, అందంగా లేదని కొందరు కామెంట్స్‌ చేశారు.

వారి వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయి.ఆమె కూడా వారి వ్యాఖ్యలకు బాధపడి ఉంటుందనుకున్నాను.

అందుకు ఆమెను ముద్దు పెట్టుకున్నాను.ఆమె బాగాలేదన్న వారికి చెంప దెబ్బ అన్నట్లుగా నేను ఆమెను ముద్దు పెట్టుకున్నాను.

అంతే తప్ప ఇందులో దురుద్దేశ్యం ఏమీ లేదన్నాడు.

నేను ముద్దు పెట్టుకోవడం వల్ల తాను అందంగా ఉన్నాననే ఆలోచన ఆమెకు కలిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావించాను.

అంతే తప్ప నేనేం ఆమెను కామంతో ముద్దు పెట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.అతడి వింత వాదనలకు మైండ్‌ బ్లాంక్‌ అయిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.ఒకానొక సమయంలో పాల్‌ వాదనను కోర్టు సమర్ధించినట్లుగా అనిపించింది.కాని ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు పెదాలపై ముద్దు పెట్టాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసు తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

England Foot Ball Player Paul Gascoigne Kissed A Woman On Train-england Foot Ball Player,he Kissed A Women,lawyer Mindi Blacked When He Says Truth,some Members Teased A Women Thats Why Iam Kissed A Women Related....