ఈ విషయంలో సోషల్ మీడియాను బహిష్కరించాలంటున్న క్రికెటర్

ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం ఒకంతకీ మంచిదే అయినప్పటికీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.

 England Cricketer Stuart Broad Willing To Boycott Social Media, England Crickete-TeluguStop.com

ఎందుకంటే రకరకాల విషయాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తులపై అసత్య ఆరోపణలు ఇలా చాలా రకాల సంఘటనలు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి.ఇక సోషల్ మీడియాకు అడ్డుకట్ట వేసే నియంత్రణ వ్యవస్థ రావాలని ఇప్పటికీ చాలా మంది డిమాండ్ చేస్తున్నారంటే సోషల్ మీడియాతో నష్టం అని ఎంతమంది భావిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఈ వాదన ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందంటే ఈ మధ్య క్రికెటర్ లపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ సోషల్ మీడియాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.తాజాగా మొయిన్ అలీపై ఓ రచయిత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే.

అయితే సదరు యాప్ లు అటువంటి ఘటనకు బాధ్యత వహించాలని, ఇక వారి నియంత్రించని పక్షంలో ఇక సోషల్ మీడియాను బాయ్ కాట్ చేయడం ద్వారానే సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపిస్తోందని బ్రాడ్ అభిప్రాయ పడ్డారు.అయితే ఇది సదరు యాప్ లకు ఇంగ్లాండ్ టీం తరపున ఇచ్చిన హెచ్చరికగా పలువురు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube