మొటేరా పిచ్ ను దాంతో పోల్చిన ఇంగ్లాండ్ క్రికెటర్..!

గడిచిన వారంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా విజయం సొంతం చేసుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్ ఎప్పుడు ‌  ఏదో ఒక విషయం పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.మూడో టెస్ట్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ అసలు ఆ వేదిక టెస్ట్ మ్యాచ్ నిర్వహించాల్సినది కాదని, మూడో టెస్ట్ లో ఎవరు విజయం సాధించలేదని టీమిండియా ఏం చేసినా ఐసీసీ అభ్యంతరం చెప్పకుండా ఇలా చేయడం సబబు కాదంటూ మీడియా పూర్వకంగా సంచలన వ్యాఖ్యలు చేసాడు మైకెల్‌.

 England Cricketer Compares Motera Pitch-TeluguStop.com

ఇలా ఉండగా తాజాగా మైకెల్ వాన్ మొటేరా పిచ్ ఉద్దేశపూర్వకంగా మరో పోస్టును సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశాడు.మొటేరా పిచ్ టెస్ట్ కు సంబంధించి మొటేరా పిచ్ ను ఏ విధంగా రూపొందించారో చూడండి అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కోడుతుంది.ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా ? ఒక రైతు తన ఎద్దులతో పొలం దున్నుతున్నట్లు ఉంది.ఈ ఫోటోను వాట్ మోటేరా పిచ్ తో పోలుస్తూ మొటేరా పిచ్‌ను క్యురేటర్‌ కూడా ఇలానే సిద్ధం చేస్తున్నాడు.ఈసారి మాత్రం 5 రోజులు మ్యాచ్‌ జరిగేలా ప్రయత్నిస్తున్నట్లున్నాడు.

 England Cricketer Compares Motera Pitch-మొటేరా పిచ్ ను దాంతో పోల్చిన ఇంగ్లాండ్ క్రికెటర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ 5 రోజులు కూడా పిచ్‌ స్పిన్‌ కు అనుకూలించేలా రూపోందిస్తున్న అతన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా అంటూ కామెంట్ చేశాడు.

ఇక మూడో టెస్ట్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో రెండు రోజుల వ్యవధిలోనే విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ విజయం సొంతం చేసుకున్నాక నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1 సిరీస్ లో ముందడుగులో ఉన్నది అందరికి తెలిసిందే.ఈ నాలుగో టెస్ట్ కు టీమిండియా ఆటగాడు బూమ్రా దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఇక నాలుగో టెస్ట్ ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న మొదలవబోతోంది.

#England Team #Farmer Post #PinkBall #Michael Vaughan #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు