డెత్ చైర్: ఆ కుర్చీలో కూర్చుంటే ప్రాణాలు పోతాయట..!

సాధారణంగా రాజకీయాల్లో ఒక్కసారి పవర్ ఉన్న కుర్చీల్లో కూర్చుంటే జీవితాంతం అదే కావాలనుకుంటారు.ఇంకా అందులో నుంచి లేచిరావడానికి ఎవరు ఆసక్తి చూపించారు.

 Busby Death Chair Viral,, Death Chair, England, Mystery, Museum-TeluguStop.com

దాని పవర్ అలాంటిది.అయితే ఇంగ్లాండ్ లో ఉన్న ఓ కుర్చీలో కూర్చోడానికి ఎవరు ఆసక్తి చూపించారు.

ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని నార్త్ యార్క్ షైర్ లోని త్రిస్క్ అనే ప్రాంతంలో ఓ దొంగ ఉండేవాడు.అతడికి ఎలిజిబిత్ అనే కూతురు ఉండేది.

ఆమె థామస్ బస్బే అనే యువకుడిని వివాహం చేసుకొని ఎంతో ఆనందంగా ఉండేది.అయితే కొద్దిరోజులకు వారు ఓ కుర్చీ కోసం నిత్యం గొడవ పడేవారు.

దీంతో కూతురు ఎలిజిబిత్ ను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి డానియల్ వచ్చారు.అయితే బస్బే ఇంటికి వచ్చే సరికి డానియల్ తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చొని ఉండటంతో అతనితో గొడవపడ్డాడు.

గొడవ పెద్దగా మారి మామను చంపేశాడు.దీంతో అప్పటి అధికారులు బస్సేని ఉరి తీసి చంపేశారు.

అయితే ఉరి తీసే ముందు ఆఖరి కోరిక అడిగి తెలుసుకోగా అతను ఆ కుర్చీలో కాసేపు కూర్చోవాలని కోరాడట.దీంతో అధికారులు అందుకు అనుమతి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టగా భావోద్వేగానికి లోనయ్యాడట.

బస్సే కుర్చీని కొద్దిరోజులకు హోటల్ కి ఇచ్చేయగా అక్కడ ఆ కుర్చీలో కూర్చున్న 200 మందికిపైగా ఒకరి తర్వాత ఒకరు మరణించారు.దీంతో హోటల్ యాజమాన్యం ఆ కుర్చీని మ్యూజియంకు ఇచ్చేశారు.

అక్కడ కూడా కుర్చీని కింద కట్టకుండా పైనా కట్టేశారు.అప్పుడే ఈ కుర్చీకి డెత్ చైర్ అని పేరు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube