ఆత్మ పిలుస్తోంది అంటూ... ఆ కుర్రాడు ... ?   Engineering Student Commits Suicide Due Soul Calling Him     2018-10-16   19:41:35  IST  Sai M

ఓ కుర్రాడి ఆత్మ తనను పిలుస్తుందని చెప్పి పద్దేనిమిదేళ్ల యువకుడు తన నూరేళ్ళ జీవితానికి ముగింపు పలికేసాడు. పూర్తి వివరాలు పరిశీలిస్తే… నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్‌(18) ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. ఆ రోజు నుంచి సౌరభ్‌ ఆ బాలుని ఆత్మను తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని భావించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. కానీ సౌరభ్‌ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు.

కాగా కొద్ది రోజుల క్రితం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మైనర్‌లు చనిపోయారు. దీనికి కూడా సదరు బాలుని ఆత్మనే కారణమని భావించాడు సౌరభ్‌. తనను తీసుకెళ్లడానికే ఆ బాలుని ఆత్మ ప్రయత్నిస్తుందని.. ఈ ‍క్రమంలోనే ఆ ఇద్దరు మైనర్‌లు చనిపోయారని భావించాడు. దాంతో తాను చనిపోకపోతే ఆ బాలుని ఆత్మ మరింత మందిని చంపుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

Engineering Student Commits Suicide Due Soul Calling Him-

‘రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానం’టూ సౌరభ్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి ‘సౌరభ్‌ చాలా తెలివిగల విద్యార్థి. చదువులో ఎప్పుడు ముందుండేవాడని తెలిసింది. కానీ రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించింది. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన విషయాల గురించి కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్‌ ఆత్మహత్య చేసుకున్నాడ’ని పోలీస్‌ అధికారులు వివరించారు.