జల్సాల కోసం దొంగగా మారిన ఇంజినీరు

సమాజంలో గౌరవమైన ఇంజినీరుగా బతుకుతున్న ఓ వ్యక్తి తన జల్సాల కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు.నెలకు రూ.70 వేల జీతం కూడా మనోడి జల్సాలకు ఎగిరిపోవడంతో దొంగతనాలను తన జల్సాలకు మార్గంగా ఎన్నుకున్నాడు.అలా ఎవరో అపరిచితుల వద్ద కాకుండా తనకు తెలిసిన స్నేహితుల వద్దనే దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు.

 Engineer Becomes Thief For His Luxuries-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.కరీంనగర్ జిల్లాకు చెందిన తూముల శ్రీకాంత్ 2013లో ఓ సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించాడు.కంపెనీలో ఉండేవారితో చాలా కలిసిమెలిసి ఉండేవాడు.తన జల్సాల కోసం స్నేహితుడి ద్విచక్రవాహనంతో పాటు తెలిసిన బంధువుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి రెండు ఇళ్లల్లో 32 తులాల బంగారం దోచుకున్నాడు.

అయితే అదే వాహనం అతడిని పట్టించింది.

శనివారం సోమగూడెం వద్ద వాహనాల తనిఖీల్లో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు.

అతడి వద్ద దొంగలించబడ్డ 32 తులాల బంగారం కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube