ఈడీ చీఫ్ గా సంజయ్ కుమార్ మిశ్రా !   Enforsment Directorate New Cheif Sanjay Misra     2018-10-27   15:51:16  IST  Sai M

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ చీఫ్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి సంజయ్ కుమార్ మిశ్రాకు కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయన నియామకాన్ని శనివారంనాడు అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. 1984 బ్యాచ్ అధికారి అయిన మిశ్రా ఈడీ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారని, రెగ్యులర్ డైరెక్టర్‌ నియామకం జరిపేంత వరకు, లేదా మూడు నెలల కాలం వరకూ డైరెక్టర్‌‌ పదవికి ఆయన అదనపు బాధ్యతల్లో ఉంటారని అధికార ఉత్తర్వు పేర్కొంది. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ కర్ణాల్ సింగ్ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.