అంతు చిక్కని " బీజేపీ వ్యూహం " !

కమలనాథులు ( KamalNath )రాజకీయంగా ఎంత వ్యూహాత్మకంగా ఉంటారో అందరికీ తెలిసిందే.బీజేపీకి ( BJP )లాభం లేనిదే ఏ పని కూడా ఆచరణలోకి పెట్టరు.

 Endless Bjp Strategy Details, Kamal Nath,bjp,ap Bjp,alliances In Ap,public Welfa-TeluguStop.com

అది పొత్తుల విషయమైన, పొత్తు నుంచి విడిపోవలన్న.ప్రజా శ్రేయస్సు కంటే పార్టీ శ్రేయస్సునే ఎక్కువగా కోరుకుంటారు కాషాయ నేతలు.

అందువల్ల బీజేపీ ఒక పార్టీకి దగ్గరవుతున్న స్వలాభం కోసమే.దురమౌతున్న స్వలాభం కోసమే.

ప్రస్తుతం ఏపీలో కూడా ఇదే విధానంలో ఉన్న బీజేపీ వైఖరి.ఇతర పార్టీలను తికమకకు గురిచేస్తోంది.

నిన్న మొన్నటి వరకు ఏపీలో జనసేనతో( Janasena in AP ) మాత్రమే పొత్తులో ఉన్న బీజేపీ ఇప్పుడు త్రిముఖ కూటమిని కోరుకుంటుంది.టిడిపి, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడాలని భావిస్తోంది.

కాగా టీడీపీ, జనసేన పార్టీల మెయిన్ టార్గెట్ వైఎస్ జగన్ ను గద్దె దించడమే.

Telugu Ap, Ap Bjp, Avinash Reddy, Bjpalliance, Chandrababu, Jagan, Janasena Ap,

కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే అటు వైసీపీకి కూడా అండగా నిలుస్తోంది బీజేపీ.ఇక్కడ ఆ పార్టీ వ్యూహం ఇతర పార్టీ నేతలకు అంతు చిక్కడంలేదు.రాష్ట్ర బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా జగన్ పాలనపై ఎన్నో విమర్శలు చేస్తూనే ఉంది.

కానీ కేంద్ర బీజేపీ మాత్రం జగన్ తో స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది.వివేకా హత్య కేసులో( Viveka murder case ) అవినాష్ రెడ్డి అరెస్ట్ లో సిబిఐ జాప్యం, సకాలం కేంద్ర నిధుల విడుదల, జగన్ కేసుల ప్రస్తావన లేకపోవడం.

ఇలాంటివాన్ని గమనిస్తే జగన్ కూడా కేంద్ర బీజేపీ అండగా నిలుస్తోందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.గతంలో చంద్రబాబు హయంలో నిధుల విడుదలలో ఎంతో జాప్యం చేసిన కేంద్రం.

జగన్ హయంలో మాత్రం సకాలంలో నిధుల విధుదల చేస్తూ వస్తోంది.

Telugu Ap, Ap Bjp, Avinash Reddy, Bjpalliance, Chandrababu, Jagan, Janasena Ap,

2014-15, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూ లోటు నిధులు రూ, 10,460 కోట్ల ను ఇటీవల విడుదల చేసింది కేంద్రం.అటు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ వేగవంతం అయిన ప్రతిసారి జగన్ డిల్లీ వెళ్ళడం, అరెస్ట్ లో జాప్యం జరుగుతుండడం, అలాగే రాష్ట్ర అవినీతిపై రైడ్ లు చేస్తామని కేంద్ర సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికి ఈ వ్యవహారం ముందుకు కదలకపోవడం.ఇలాంటివాన్ని బీజేపీ, వైసీపీ అంతర్గత దోస్తీని బహిర్గతం చేస్తూనే ఉన్నాయి.

అయితే వైసీపీ ప్రభుత్వాన్ని కుల్చేందుకు అటు జనసేన, టీడీపీ పార్టీలతో చేతులు కలిపేందుకు కూడా సిద్దమౌతుండడం ఇటు వైసీపీని కలవర పెడుతున్న అంశం.ఇలా ఏపీలో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షలకు రెండిటికి సమ దూరం వహిస్తూ రెండు పిల్లులు కొట్లాడితే రొట్టె ముక్కను కోతి ఎత్తుకెళ్లినట్లు బీజేపీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఎన్నికల సమయానికి ఎటువైపు బీజేపీ పూర్తి అడుగులు వేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube