ఆ వైసీపీ నేత పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిందే...!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఆ నేత కుటుంబానికి మంచి పేరు ఉంది.తండ్రి మాజీ ఎమ్మెల్యే.

 End Card To That Ycp Leader Political Future, Ycp, Ycp Leader, Political Future,-TeluguStop.com

తండ్రి బాట‌లో ఆయ‌న కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ప్ర‌జారాజ్యం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.ఆ త‌ర్వాత కాంగ్రెస్‌, టీడీపీలోకి వెళ్లినా ఇమ‌డ లేక‌పోయారు.

చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో అవ‌మానాలతో ఆ పార్టీని వీడి వైసీపీ ఎంట్రీ ఇచ్చారు.ఆయ‌న పార్టీ మారిన‌ప్పుడే జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇస్తాన‌న్నా చివ‌ర‌కు ఎమ్మెల్యే సీటు కాదు క‌దా.

క‌నీసం పార్టీ అధికారంలోకి వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేదు.ఆ నేత ఎవ‌రో కాదు మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి.
2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుంచి విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత టీడీపీలోకి వెళ్లారు.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని వదిలి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

విజ‌య‌వాడ తూర్పు సీటుపై జ‌గ‌న్ ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టుగా చెపుతారు.అయితే చివ‌ర్లో రాజ‌కీయాలు మారిపోవ‌డంతో జ‌గ‌న్ తూర్పు సీటును ర‌వికి కాద‌ని.

ప్ర‌స్తుత న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న బొప్ప‌న భ‌వ‌కుమార్‌కు ఇవ్వ‌గా ఆయ‌న ఓడిపోయారు.అప్ప‌ట్లో ర‌వికి ఎమ్మెల్సీ ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

Telugu Ap Cm, Ap Cm Jagan, Chandra Babu, Incharge, Tdp, Ycp, Ys Jagan, Ysrcp-Tel

అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచినా తూర్పులో భ‌వ‌కుమార్ ఓడిపోయారు.త‌ర్వాత దేవినేని అవినాష్ వైసీపీలోకి వ‌చ్చి తూర్పు ఇన్‌చార్జ్ అవ్వ‌డం, భ‌వ‌కుమార్ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడు అవ్వ‌డంతో ర‌విని ప‌ట్టించుకునే వారే లేకుండా పోయారు.2014 ఎన్నిక‌ల్లో టీడీపీలోకి, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లినా ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ల‌క్ క‌లిసి రాలేదు.దీంతో ఇప్పుడు ఆయ‌న ఎటూ కాకుండా పోయారు.

ఇప్పుడు జ‌గ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే విజ‌య‌వాడ‌లో చాలా మంది నేత‌లు ఉన్నారు.
వారినికాద‌ని ర‌వికి ఏ ప‌ద‌వి ఇచ్చే ప‌రిస్థితి లేదంటున్నారు.

దీంతో ర‌వి అటు తిరిగి టీడీపీలోకి వెళ్ల‌లేక వైసీపీలో ప్ర‌యార్టీ లేక న‌లుగుతున్నారు.ఏదేమైనా ర‌వి ప‌రిస్థితికి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారిందని చెవులు కొరుక్కుంటున్నారట బెజ‌వాడ జ‌నాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube