21 ఏళ్ల సీఐడి సీరియల్ కు శుభం కార్డు.. సీరియల్ గురించి ఆసక్తికరమైన విషయాలు.!

సీరియల్ అనగానే ఓహ్ అని తలపట్టేసుకుంటాం.అప్పుడెప్పుడో నేను పుట్టినప్పుడు స్టార్ట్ అయింది ఇంకా వస్తూనే ఉంది అని ముఖం మొత్తుకుంటాం.

 End Card For The Serial Cid Which Is Running From 21 Years-TeluguStop.com

కానీ జీడిపాకంలా సాగే సీరియళ్ల విషయం పక్కన పెడితే ఏళ్లకేళ్లు సాగినప్పటికి అందరి మనసులను దోచుకున్న సీరియళ్లు కూడా మన టెలివిజన్ చరిత్రలో ఉన్నాయి వాటిలో మొదటి స్థానం దక్కించుకుంటుంది సీఐడీ… చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందర్నీ ఆకట్టుకున్న ఈ సీరియల్ ముగియబోతుంది.ఏ సీరియల్ కి శుభం కార్డు పడినా రానంత క్రేజ్ ఈ సీరియల్ కి ఎందుకూ అంటే మీరే చదవండి.

1997 నుంచి సోని ఛానల్ లో ప్రసారమవుతున్న ‘సీఐడీ’ కి మొదటి ఎపిసోడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ వరకు మంచి క్రేజ్ అందుకుంది.దాదాపు 21 ఏళ్ల నుంచివస్తోన్న ఈ సీరియల్ 1546 ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది.ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన క్రైమ్ సీరియల్ ‘సీఐడీ’.హిందీ భాషలో ప్రారంభమయినప్పటికీ ఇతర భాషల్లో కూడా అనువాదమై మంచి ఆదరణను అందుకుంది.మన తెలుగులో కూడా సీఐడీ సీరియల్ మంచి రేటింగ్ ను అందుకుంది.

సీఐడీ సీరియల్‌లో ముఖ్యంగా ఐదు క్యారెక్టర్స్ ప్రధానమైనవి.

ACP ప్రద్యుమ్న, సీనియర్ ఇన్‌స్పెక్టర్ అభిజీత్, మరో సీనియర్ ఇన్‌స్పెక్టర్ దయా, ఇన్‌స్పెక్టర్ ఫ్రెడ్రిక్స్ మరియు డాక్టర్ సాలుంకే పాత్రలు గత 21 యేళ్లుగా ఈ టీవీ ప్రేక్షకులను అలరించాయి.ఆయా పాత్రలను అమితంగా ఇష్టపడిన ప్రేక్షకులకు మరో రెండు రోజులు దాటితే వారు టివిలో ఇక కనపడరనే విషయం నిజంగా చేదు వార్తే… అప్పట్లో ముంబాయిలో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సీఐడీ ఆఫీసర్స్ ఛేధించిన కేసులనే ఈ సీరియల్‌లో చూపించారు.

సీరియల్లో నటించిన ఆయా పాత్రలు.


శివాజి సతం.


ఎసిపి ప్రద్యుమ్నగా శివాజి సతం నటించారు.ఇతనిది ఈ సీరియల్లో లీడ్ రోల్.సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి చివరి వరకు అంటే ఇరవై ఒక్క ఏళ్లుగా శివాజీ ఈ సీరియల్లో నటిస్తున్నారు.

ఆదిత్య శ్రీవాత్సవ.


సీనియర్ ఇన్సెపెక్టర్ అభిజిత్ గా నటించిన క్యారెక్టర్ అసలు పేరు ఆదిత్య శ్రీవాత్సవ.ఆదిత్య కొన్ని చిత్రాలు,టివిషోస్ లో కూడా నటించారు.

దయానంద్ శెట్టి.


ఇన్స్ప్పెక్టర్ దయా పాత్రను పోషించింది దయానంద్ శెట్టి.ధృడమైన శరీర సౌష్టవం కలిగిన దయా తన పాత్రలో ఒదిగిపోయి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

దినేశ్ ఫడ్నిస్.


ఫ్రెడ్రిక్స్ క్యారెక్టర్లో నటించిది దినేష్ ఫడ్నిస్.మంచి కామెడి రోల్.సీరియస్ గా సాగిపోతున్న సీరియల్లో తన నటనతో ,హావభావాలతో కామెడీని పండించి నవ్వు తెప్పించే క్యారెక్టర్.

నరేంద్ర గుప్తా.


డాక్టర్ సాలుంకే పాత్రలో నటించింది నరేంద్ర గుప్తా.సిఐడీ ఆఫిసర్స్ కి సాయపడే డాక్టర్ పాత్రను ఫర్పెక్ట్ గా పోషించారు నరేంద్ర గుప్తా.సీరియస్ నటనతో పాటుగా,ఫ్రెడ్రిక్స్ క్యారెక్టర్తో కలిసి డాక్టర్ సాలుంకే వేసిన పంచులు నవ్వు తెప్పించేవి గా ఉండేవి.

ఇకపై ఈ పాత్రలేవి బుల్లితెరపై కనిపించవు.

రేటింగ్ లో ఎక్కడా తగ్గకుండా సాగుతోన్న సమయంలో సీరియల్ నిర్మాత బీపీ.సింగ్ సడన్ గా సీరియల్ ను ఆపేస్తున్నట్లు తెలుపుతూ.

ఇక ‘సీఐడీ’ ఉండదని చెప్పారు.ఇక చివరి ఎపిసోడ్ ఈ నెల 29న ప్రసారం కానుంది.

ఇక సీరియల్ లో ఇన్‌స్పెక్టర్ గా నటించిన దయా షో ముగుస్తున్న సందర్బంగా తన వివరణను ఇచ్చాడు.సీరియల్ విషయంలో టీఆర్ పి తో పాటు అంతా బాగానే ఉంది.

సీరియల్ మధ్యలో నిర్మాత సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పడం తమకు ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోందని అన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube