వైరల్: ఖగోళ శాస్త్రం పై పుస్తకం రాసిన పదేళ్ల బుడ్డోడు..!

ఖగోళంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.శాస్త్రవేత్తలు ఇంకా ఏదో విషయంపై తమ పరిశోధనలు సాగిస్తున్నారు.

 En Year Old Uncle Who Wrote A Book On Astronomy-TeluguStop.com

ఇదిలా ఉంటే ఓ 10 సంవత్సరాల చిచ్చర పిడుగు ఏకంగా ఖగోళ భౌతికశాస్త్రంపైనే ఓ పుస్తకం రాసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.కోల్ కతాకు చెందిన రేయాన్ష్ దాస్ ఈ ఘనతను సాధించాడు.

చిన్నతనం నుంచి ఈ పిల్లోడు ఆకాశంలోకి తదేకంగా చూసేవాడు.అలా ఆకాశంలో చుక్కలు, చందమామతో పాటుగా ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ పై ఈ బాలుడు తెగ ఇష్టాన్ని పెంచేసుకున్నాడు.

 En Year Old Uncle Who Wrote A Book On Astronomy-వైరల్: ఖగోళ శాస్త్రం పై పుస్తకం రాసిన పదేళ్ల బుడ్డోడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన పుస్తకం ద్వారా రేయాన్ష్ దాస్ సైన్సు ఇంకా ఖగోళశాస్త్ర విశిష్ఠతను తెలియజేశాడు.రేయాన్ష్ తనకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే లైఫ్ బియాండ్ నంబర్స్ అనే పేరుతో ఓ బుక్ ను రాశాడు.

ఆ పుస్తకానికి అమెజాన్‌లో గుడ్ రివ్యూస్ ఇచ్చారు.తాజాగా ఈ బాలుడు ది యూనివర్స్ : ది పాస్ట్, ది ప్రెజెంట్ అండ్ ది ఫ్యూచర్ అనే బుక్ ను ప్రజలకు అందించాడు.

ఈరకం పుస్తకంలో బిగ్ బ్యాంగ్ థియరీ, కాంతి వేగం, టైమ్ డైలేషన్, పాజిబుల్ మల్టిపుల్ థియరీస్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజాక్ న్యూటన్ మధ్య వ్యత్యాసం, ఫ్యూచర్ ఆఫ్ ది యూనివర్స్, లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్, సౌర వ్యవస్థ, నక్షత్ర అవశేషాలు, ద కర్వేచర్, బ్లాక్ మ్యాటర్, బ్లాక్ ఎనర్జీ, స్పేస్ టైమ్ వంటివి ఎన్నో రకాలైన విషయాల గురించి తెలియజేశాడు.రేయాన్ష్ అందించిన స్పేస్ కాన్సెప్ట్ అందర్నీ ఆకట్టుకుంది.

ఆ బాలుడి ఐడియా అద్భుతంగా ఉందని రీసెర్చ్ స్కాలర్ నందితా రహా తెలియజేయడం విశేషంగా చెప్పొచ్చు.

అమెజాన్‌ లో ఈ బాలుడి టాలెంట్ ను చూసి అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చిన్నతనంలో ఈ బాలుడు ఆకాశాన్ని చూస్తూనే చుక్కులు ఎలా వచ్చాయనేదానిపై ఆలోచించేవాడు.తనకు తానే వాటిని చూస్తూ అనేక ప్రశ్నలు వేసుకునేవాడు.

అలా వాటి మీద ఇష్టంతోనే ఖగోళానికి సంబంధించినటువంటి బుక్స్ ను చదవడం అలవాటు చేసుకున్నాడు.వాటికి సంబంధించిన అనేక రకాల వీడియోలను చూడటం ప్రారంభించాడు.

చివరికి ఇలా పుస్తకం రాసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

#Book #Kolkata Boy #10 Years #Astrophysics #Social Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు