బాలీవుడ్ ఫేక్ అంటున్న నటుడు.. ఎందుకంటే?

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.తను నటించే సినిమాలలో తన పాత్రలు మంచి గుర్తింపు తో ఉంటాయి.

 Bollywood Industry Is Fake Says Emraan Hashmi, Emraan Hashmi, Bollywood,industr-TeluguStop.com

ఆయన సినిమాలలో తన పాత్ర నటనలో లీనమవుతాడు.అంతే కాకుండా ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

నటనే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ సినీ పరిశ్రమ ఫేక్ అంటున్నాడు ఇమ్రాన్.

ఏ సినీ పరిశ్రమలో నైనా ఏదో రకంగా నటీనటులకు ఒత్తిడి అనేది ఉంటుంది.అవన్నీ ఎదుర్కొని మరీ సినీ ప్రవేశం చేస్తారు.అంతేకాకుండా వాళ్ల ముందు మంచిగా నటిస్తూ వాళ్ళ వెనకాల వెన్నుపోటు పొడిచే సినీ పరిశ్రమ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు ఇమ్రాన్.తాజాగా ఆయన తనకు అన్నం పెట్టే సంస్థ పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా చేయడానికి అసలు కారణం ఉందంటున్నాడు ఇమ్రాన్.

Telugu Bollywood, Emraan Hashmi, Importance, Personal, Radio Interview-Movie

తాజాగా ఇమ్రాన్, సిద్ధార్థ్ ఖన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.ఈ విధంగా ఆయన మాట్లాడుతూ.

ఈ రంగుల ప్రపంచం అంతా ఫేక్ అని, అందుకే తన పని పూర్తయ్యాక ఈ రంగం నుండే సంబంధం లేనట్లు దూరంగా ఉంటాను అని తెలిపాడు.

బాలీవుడ్ సినీ పరిశ్రమను అందరి ముందు మనలిని పొగుడుతున్నట్లు కనిపిస్తారు కానీ అసలు విషయం ఏంటంటే మన వెనకాల మన గోతులు తీస్తూ కిందకు లాగుతుంటారని ఇదే బాలీవుడ్ లో జరుగుతున్న పచ్చి నిజం అంటే చెప్పుకొచ్చాడు.

కానీ ఆయన తన వృత్తి కంటే వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువ నమ్ముతానని కలిపాడు.దీంతో ఆయన తన వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా.

బాలీవుడ్ లో తన పేరు ఇంకా వినిపిస్తుందంటే కారణం తన స్నేహితులు, తన తల్లిదండ్రులేనని తెలిపాడు.కాబట్టి తను ఇంకా అక్కడే ఉన్నానని, తన పనేదో తాను చూసుకుంటూ ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతంగా ఉన్నానని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube