ఉద్యోగుల ఆందోళనలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదు ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌.

ఉద్యోగుల ఆందోళనలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

 Employees' Concerns Have Nothing To Do With The Formation Of New Districts, Said-TeluguStop.com

కొత్త జిల్లాల ఏర్పాటు పై మాట్లాడారు.లోక్ సభ నియోజకవర్గ పరిధి, భౌగోళిక విస్తీర్ణం, జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ప్రతిపాదనలు చేశామని చెప్పారు.

పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం గత ఏడాదిన్నరగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు చేసి నిర్ణయం తీసుకుందన్నారు.

ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కచ్చితంగా అమలులోకి వస్తుందని తెలిపారు.

ఈ విషయంలో ప్రభుత్వం ఓపెన్‌గా ఉందని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని విజయ్‌కుమార్‌ చెప్పారు.విజయవాడ విషయంలో కొంత ఇబ్బంది అయిందని పేర్కొన్నారు.

మచీలీపట్నంలో పోర్డు ఉండటంతో గన్నవరం లాంటి ప్రాంతాలను కూడా మచీలీపట్నంలోనే కొనసాగించాలనుకున్నామని విజయ్‌కుమార్‌ వెల్లడించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube